Sandeep Raj wedding: 'కలర్ ఫొటో' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్, చాందిని రావ్ మూడు మూళ్ళ బంధంతో ఒకటయ్యారు. నేడు తిరుమలలో వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. చాందిని రావ్ రణస్థలి అనే చిత్రంలో నటించింది. ఈ పెళ్లి వేడుకలకు సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల, హీరో సుహాస్, వైవా హర్ష, పలువురు సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: బాలీవుడ్ లో పుష్ప మేనియా.. పుష్ప రాజ్ దెబ్బకు షారుఖ్, సల్మాన్ రికార్డ్స్ బ్రేక్
మూడు ముళ్ళుతో ఒకటైన 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీరావు. వీరిద్దరి పెళ్ళి తిరుమలలో ఘనంగా జరిగింది.... ఈ వేడుకకు హీరో సుహాస్ దంపతులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. #ColorPhoto #Suhas #sandeepraj #chandinirao #marriage #tollywood #HashtagU pic.twitter.com/eETnENVxKf
— Hashtag U (@HashtaguIn) December 7, 2024
Also Read: ఏపీ రేషన్ మాఫియాపై సిట్ సరే.. అదానీ స్కాం పరిస్థితి ? : వైఎస్ షర్మిళ
సందీప్ రాజ్ సినిమాలు..
సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫొటో చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం వరించింది. ప్రస్తుతం సందీప్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా 'మోగ్లీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతే కాదు సందీప్ నటుడిగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'భైరవం' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Also Read: ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పై క్లారిటీ .. ఇన్స్టా పోస్ట్ వైరల్!
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్