/rtv/media/media_files/2025/04/12/Ki5PgBzrMMA405bQNk0W.jpg)
Sai Rajesh
Sai Rajesh: టాలీవుడ్‌లో విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సాయి రాజేశ్, ఇటీవల జరిగిన ‘సోదరా’ ట్రైలర్ విడుదల వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, ఈ సినిమా కథానాయకుడు సంపూర్ణేశ్ బాబుతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని అభిమానులతో పంచుకున్నారు.
'సోదరా' 25న గ్రాండ్ రిలీజ్
సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu), సంజోష్ అన్నదమ్ములుగా నటించిన 'సోదరా' చిత్రం , ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. వినూత్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. ఇందులో ఆర్తి, ప్రాచి బన్సాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే, ఈ ప్రత్యేక ఈవెంట్‌లో దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, సంపూర్ణేశ్ బాబుతో తనకు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వం, వినోదాత్మక శైలి, ఆడియెన్స్‌కు కలిగించే పాజిటివ్ ఎనర్జీ గురించి ప్రశంసలు కురిపించారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
సోదరా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో చక్కటి స్పందన పొందుతోంది. భిన్నమైన కథనంతో పాటు, సంపూర్ణేశ్ బాబు ప్రత్యేక కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
ఈ మూవీ వినోదానికి కొత్త నిర్వచనం అందించనుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తానూ నటించిన పాత్రల కంటే విభిన్నంగా సోదరాలో కనిపించనున్న సంపూర్ణేశ్ బాబు, మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!