రైతులకు కేంద్రం 'దసరా' కానుక - 'పీఎం కిసాన్‌ నిధులు' విడుదల ఎప్పుడంటే!

దసరా ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్తను తెలియజేసింది. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను అక్టోబర్‌ 5న ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్లు కేంద్రం తెలియజేసింది.

New Update
kisan

Pm Kisan Yojana:అన్నదాతలకు. కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలుస్తుంది. ఇంతకీ.. ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి? ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ-కేవైసీ చేసుకోకపోతే ఎలా పూర్తి చేసుకోవాలి? అనే విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read: విచిత్ర వాతావరణం..అక్కడ వానలు..ఇక్కడ మండుతున్న ఎండలు!

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" స్కీమ్​ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు సార్లు నేరుగా రైతుల అకౌంట్స్ లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ - జులై మొదటి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్ర సర్కార్ ఈ ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

Also Read: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య

ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 17 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు దసరా ముందు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. తాజాగా.. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను "2024, అక్టోబర్ 5న" ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

Also Read: హైడ్రా విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం..ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు

అదేవిధంగా.. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్​సైట్​లో సూచించారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు దీనిని స్పష్టం చేసింది. కాబట్టి.. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ- కేవైసీ చేయించుకోకపోతే వెంటనే దానిని పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: అదానీ, పొంగులేటి డీల్.. రహస్య చర్చలు

Advertisment
తాజా కథనాలు