Jailer 2: 'కూలీ'కి చేసిన మిస్టేక్ రిపీట్ అవ్వదు.. 'జైలర్ 2' తో మ్యాజిక్ చూపిస్తా: నెల్సన్

రజనీకాంత్ "జైలర్ 2"పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బాలకృష్ణ వంటి స్టార్‌లు ఈ సినిమాలో భాగమవుతారన్న టాక్. డైరెక్టర్ నెల్సన్ బడ్జెట్ హైప్‌ను తగ్గిస్తూ, సినిమా కంటెంట్‌తోనే మెప్పిస్తానని తెలిపారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

New Update
Jailer 2

Jailer 2

Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తున్న మల్టీస్టారర్ "జైలర్ 2"(Jailer 2 Movie) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడంతో, సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ హైప్ ఏర్పడింది.

ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ పవర్ స్టార్ శివరాజ్ కుమార్ల లాంటి స్టార్ హీరోలు ఇందులో ఉన్నట్టు సమాచారం. ఇదే కాకుండా టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ నెల్సన్(Director Nelson), సినిమాపై అభిమానులు పెట్టుకుంటున్న అంచనాల గురించి చాలా విషయాలు పంచుకున్నారు. 

"జైలర్ 2 విడుదలయ్యే వరకు వెయిట్ చేయండి. రజనీ సర్ మ్యాజిక్ వెండితెరపై మీరు చూస్తారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి అంచనాలు పెంచడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే, ఆ అంచనాలకు సినిమా తక్కువైతే, ప్రేక్షకులు నిరాశ చెందుతారు. అందుకే సైలెంట్‌గా ఉంటూ, సినిమా మెయిన్ కాన్టెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం." అని అన్నారు. 

షూటింగ్ అప్‌డేట్ & ప్రీ ప్రొడక్షన్

ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో "జైలర్ 2" పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయిందని, రజనీ సర్ కూడా కథను బాగా ఇష్టపడ్డారట. ఇకపోతే, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తి అయిందని సమాచారం. 

అంతేకాదు, జైలర్‌లో ఉన్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు సీక్వెల్‌లో కొనసాగబోతున్నట్టు సమాచారం. అలాగే, ఈసారి మరిన్ని సర్ప్రైజ్ గెస్ట్ రోల్స్ కూడా ఉండబోతున్నాయట.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

2023లో విడుదలైన "జైలర్" సినిమాను నెల్సన్ మాస్ ఎలిమెంట్స్, స్టైల్, సంగీతం మిక్స్ చేసి డిజైన్ చేశారు. ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, రజనీకాంత్ కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలిచింది.

ఈ హవా కొనసాగించేందుకు "జైలర్ 2"ను భారీ బడ్జెట్‌తో, టెక్నికల్‌గా మరింత బలంగా తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం "కూలీ" సినిమా నిరాశ ఇచ్చిన తర్వాత, ఈ సినిమాతో రజనీ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వస్తాడని నమ్ముతున్నారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

“జైలర్ 2” రజనీకాంత్ అభిమానులకే కాదు, సౌత్ ఇండియన్ సినిమా లవర్స్‌కి కూడా మోస్ట్ వెయిటెడ్ మూవీగా మారింది. స్టార్స్‌తో పాటు, కథలోని మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ చూస్తే... ఈ సినిమా మరో ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు