Sharwanand: ఫ్లాప్‌ హీరోయినే కావాలంటున్న శర్వానంద్..!

డింపుల్ హయాతి కెరీర్‌లో హిట్ లేక సైలెంట్‌ అయిపోయిన ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా శర్వానంద్ 38వ సినిమా ‘భోగి’లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. వరుస ప్లాపుల మధ్య ఈ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.

New Update
Sharwanand Dimple Hayathi Bhogi

Sharwanand Dimple Hayathi Bhogi

Sharwanand: టాలీవుడ్ లో తనదైన స్టైల్‌తో గుర్తింపు పొందిన డింపుల్ హయాతి(Dimple Hayathi), గత రెండు సంవత్సరాలుగా వెండితెరపై కనిపించలేదు. రామబాణం చిత్రంతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత ఆమె నుంచి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. కాని కెరీర్ పరంగా మాత్రం సైలెంట్‌గానే ఉంది.

Also Read:రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు కావొచ్చినా, ఇప్పటికీ డింపుల్‌కు ఒక మంచి హిట్ దక్కలేదు. పేరులో మార్పు చేస్తూ ‘హయాతి’ అని యాడ్ చేసినా అదృష్టం మాత్రం మారలేదు. గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తక్కువ కాలంలోనే తమిళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. అయినప్పటికీ, అభినేత్రి 2, అత్రంగి రే వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు పెద్దగా కలిసిరాలేదు.

వాల్మీకిలో స్పెషల్ సాంగ్ చేసినా, కిలాడీలో రవితేజ సరసన నటించినా, డింపుల్‌కు బ్రేక్ మాత్రం రాలేదు. ఇక గోపిచంద్ తో తీసిన రామబాణం పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో సినిమాల నుంచి విరామం తీసుకున్నట్టైంది. టాలీవుడ్‌కి చెందిన డింపుల్ తమిళ చిత్రాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ ఫలితం అదే. ‘మాస్ మహారాజా’, ‘మ్యాచో స్టార్’ వంటి హీరోల సరసన కనిపించినా ఆమె కెరీర్ హిట్ టర్న్ తీసుకోలేదు.

Also Read:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

‘భోగి’(Bhogi) ఫస్ట్ స్పార్క్ గ్లింప్స్..

అయితే తాజాగా డింపుల్‌కు ఒక కొత్త అవకాశం లభించింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ సినిమా ‘భోగి’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవలే విడుదలైన  ‘భోగి’(Bhogi) ఫస్ట్ స్పార్క్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శర్వానంద్ సైతం ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. మనమే, మహా సముద్రం, ఆడాళ్ళు మీకు జోహార్లు వంటి సినిమాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి.

డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, డింపుల్ కలిసి చేస్తున్న  'భోగి' అనే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో అయినా అమ్మడి కెరీర్‌కు ఏదైనా కొత్త మలుపు వస్తుందేమో చూడాలి.

Advertisment
తాజా కథనాలు