/rtv/media/media_files/2025/09/16/idly-kottu-2025-09-16-09-35-49.jpg)
Idly Kottu
Idly Kottu Trailer: తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) మళ్లీ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన తదుపరి సినిమా ‘ఇడ్లీ కడై’ అనే ఆసక్తికర టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఇడ్లీ కొట్టు’ అనే పేరుతో అక్టోబర్ 1, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో ధనుష్ కేవలం హీరోగానే కాకుండా, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘నీక్ (NEEK)’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినా, ఈ సారి ‘ఇడ్లీ కడై’తో పక్కా హిట్ కొట్టాలనే ధనుష్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ట్రైలర్ డేట్ ఫిక్స్..
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 20న కోయంబత్తూరులో జరిగే ఒక స్పెషల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన టీమ్, ఈ ట్రైలర్ ఈవెంట్ ద్వారా ప్రమోషన్లలో జోరు పెంచాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది.
ఈ చిత్రంలో నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమెతో ధనుష్ కాంబినేషన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరోవైపు, విలన్ పాత్రలో అరుణ్ విజయ్ నటిస్తున్నారు. విలన్ పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉంటుందని సమాచారం. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఈ సినిమాలో ధనుష్ సోదరిగా కనిపించనున్నారు. ఇది ఆమె పాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మూవీ టీమ్ చెబుతోంది.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
ఈ సినిమాను వండర్‌బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా జీవి ప్రకాశ్ కుమార్ పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ధనుష్ గత సినిమాల్లో మంచి నటనతో పాటు కథల ఎంపికలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు కథ, దర్శకత్వం స్వయంగా ధనుష్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
‘ఇడ్లీ కడై’ అంటూ వినూత్న టైటిల్‌తోనే అందరిని ఆకర్షించింది ఈ మూవీ. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌లు, ఆడియో ట్రాక్‌లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.
ధనుష్ మళ్లీ తన దర్శకత్వం ద్వారా ప్రేక్షకుల మనసులను దోచుకుంటాడా లేదా అన్నది అక్టోబర్ 1న థియేటర్లలో తేలనుంది. అయితే ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు అక్టోబర్ 20న విడుదల కాబోతున్న థియేట్రికల్ ట్రైలర్‌ను చూడొచ్చు. ధనుష్ అభిమానులకే కాకుండా, మంచి కథల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఓ మంచి సినిమాగా నిలవనుంది.