Janhvi Kapoor: దేవర ట్రైలర్ లాంచ్ లో జాన్వీ మాటలకి టాలీవుడ్ ఫిదా..!

దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. తల్లి శ్రీదేవికి తెలుగు సినిమా ప్రధాన స్రవంతి కావడంతో మళ్ళీ హోమ్ కమింగ్‌లా ఉందని గుర్తుచేశారు.

author-image
By Archana
New Update
janhvi kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor: సౌత్ సూపర్ స్టార్ ఎన్టీఆర్- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'(Devara). అద్భుతమైన యాక్షన్, రొమాంటిక్ లవ్ స్టోరీతో భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నిన్న మంగళవారం సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా దేవర ట్రైలర్ ను లాంచ్ చేశారు. లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ పాల్గొన్నారు.

''హోమ్ కమింగ్‌లా అనిపిస్తుంది''

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నటి జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమాల్లో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. ఆమె తల్లి శ్రీదేవికి(sridevi) తెలుగు, తమిళ సినిమా ప్రధాన స్రవంతి కావడంతో.. ఇది తన తొలి సినిమా అయినప్పటికీ మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పింది. తెలుగు ఆమె తల్లి శ్రీదేవి సినీ ప్రస్థానం గురించి మరో సారి గుర్తుచేసుకున్నారు జాన్వీ. (Janhvi Kapoor) అంతే కాదు సౌత్ ఇండియన్ స్టార్ శ్రీదేవి తారక్ తాత.. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొండవీటి సింహం, వేటగాడు, ఆటగాడు, బడి పంతులు, సర్దార్ పాపా రాయుడు పలు చిత్రాల్లో ఎన్టీఆర్- శ్రీదేవి జంటగా నటించారు.

జాన్వీ మాట్లాడుతూ

అలాగే జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. "తారక్ కో-స్టార్ గా ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ తో(NTR) పనిచేసిన తర్వాత ఆయనకు మరింత పెద్ద అభిమానిని అయ్యాను. ఇది నా మొదటి తెలుగు చిత్రం. చాలా ప్రత్యేకమైనది అని తెలిపింది." బాలీవుడ్ లో దేవర థియేట్రికల్ రైట్స్ ను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.  దేవర తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో తారక్ యాక్షన్, విజువల్స్, డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు