Devara Movie Review:
తెలుగు రాష్ట్రాలు దేవర సినిమా పిచ్చితో ఊగిపోతున్నాయి. ఆరు ఏళ్ళగా వెయిట్ చేస్తున్న ఎన్టీయర్ ఫ్యాన్స్‌కు అయితే పండగే అని అంటున్నారు. మొత్తం సినిమా అంతా తారక్ దేనని అంటున్నారు. కథ, అనిరుధ్ బీజీఎం అన్నీ అదిరిపోయాయి అని అంటున్నారు. ఫస్ట్ హాప్ కొంత డల్‌గా ఉన్నట్టు అనిపించినా...ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మాత్రం చించేశాడని ప్రేక్షకులు చెబుతున్నారు. అసలు అలాంటి క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించరని అంటున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని అరిచి మరీ గోల చేస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ వస్తుందని అంటారు...కానీ అది ఎన్టీయార్ విషయంలో మాత్రం కాదు అని చెబుతున్నారు ఫ్యాన్స్. తారక్ ఓ లెవల్‌ల యాక్ట్ చేశాడని...ఇంక దేని కోసం వెళ్ళినా...వెళ్ళకపోయినా అతని కోసం సినిమా చూడొచ్చని అంటున్నారు. నెగెటివ్ రివ్యూలను వినోద్దని...సినిమా చూసి వచ్చి మాట్లాడాలని అంటున్నారు. కల్కి సినిమాలో అయితే ఎలా అంతా పరిచయం చేసి..సెకెండ్ హాఫ్ కోసం ఎదురు చూడండి అని చెప్పారో...దేవరలో కూడా అంతే. సినిమాలో మొదటి హాఫ్ అంతా దేవర ప్రపంచాన్ని పరిచయం చేశారు. సెకండ్ హాఫ్‌లో పీక్స్‌కు తీసుకెళ్ళారు అని చెబుతున్నారు. దేవర పార్ట్–2లో అసలు సినిమా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కొందరు చెప్పారు. అయితే కొంతమంది మాత్రం సినిమా బాలేదని..3,500 రూ.లు పెట్టి టికెట్ కొనుక్కుని వస్తే నిరాశే ఎదురయిందని చెప్పారు. మరొకరు సినిమాలో నిద్రపోయానని కూడా అన్నారు.
మరోవైపు ఓవర్సీస్‌లో కూడా మొదటి షో పడిపోయింది. అక్కడ ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. కేవలం ఎన్టీయార్ ఒక్కడే సినిమాను లాగేశాడని...మిగతాదంతా సోసో గా ఉందని రివ్యూలు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో దేవర మూవీకి 3/5 రేటింగ్ ఇస్తున్నారు.