Delhi CM: నా శరీరాన్ని దేశానికి అంకితం చేస్తున్నా.. ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన!

అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' ప్రీమియర్ షో చూసిన తర్వాత ఢిల్లీ CM రేఖగుప్తా భావోద్వేగానికి గురయ్యారు. తన శరీరం, మనసు, జీవితం మొత్తాన్ని దేశానికి అంకితం చేస్తున్నానని అన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ విషాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.

New Update
delhi cm rekha Gupta on kesari chapter 2

delhi cm rekha Gupta on kesari chapter 2

Delhi CM:  కరణ్ ఎస్ త్యాగి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్' ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించగా..  ఢిల్లీ సీఎం రేఖాగుప్తా  హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత సీఎం రేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాతృభూమి కోసం తన  జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును అంకితం చేయాలనుకుంటున్నాను అని ఎమోషనల్ అయ్యారు. 

ఢిల్లీ సీఎం రేఖ భావోద్వేగం.. 

రేఖ గుప్తా ఇంకా మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన లక్షలాది మంది గురించి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఖచ్చితంగా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మన కోసం జీవితాలు త్యాగం చేసిన ఎంతో మంది పేర్లు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం మన మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మాతృభూమి కోసం నేను నా జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును అంకితం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది అని అన్నారు.  రేఖా గుప్తాతో పాటు, హర్దీప్ పూరి, మంజిండియర్ సింగ్ సిర్సా, బన్సూరి స్వరాజ్,  అనురాగ్ ఠాకూర్ వంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.

Also Read: Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!

స్వాత్యంత్ర సమరయోధుడు జలియన్‌ వాలాబాగ్‌ విషాదం నేపథ్యంలో రూపొందిన  ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యష్ జోహార్, అరుణా భాటియా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే మూవీ నుంచి  విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. 

latest-news | cinema-news | telugu-news 

Also Read: Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన వైజాగ్ పోలీసులు.. బాలుడు చనిపోవడంతో.. !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు