/rtv/media/media_files/2025/09/20/deepika-padukone-2025-09-20-09-22-24.jpg)
Deepika Padukone
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇటీవల వరుసగా రెండు సినిమాల నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్’ నుంచి ఆమె తప్పుకోగా, తాజాగా 'కల్కి 2898 AD' సీక్వెల్(Kalki 2) నుంచి కూడా బయటకు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు చిత్రబృందం ఓ నోట్ విడుదల చేస్తూ, "ఈ సినిమా సీక్వెల్‌లో దీపికా భాగం కాదు. తొలి పార్ట్ చేసేటప్పుడు ఆమెతో చాలా ప్రయాణం జరిగినప్పటికీ, మళ్ళీ తనతో కలిసి పనిచేసే అవకాశం ఈసారి కనిపించలేదు. అలాంటి భారీ ప్రాజెక్ట్‌కి పూర్తి నిబద్ధత అవసరం. దీపికాకు భవిష్యత్తులోని ప్రాజెక్ట్స్‌కి శుభాకాంక్షలు" అంటూ పేర్కొన్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు దీపికా ఎక్కువ పారితోషికం అడిగిందంటూ, మరికొందరు తక్కువ పని గంటలు కావాలని కోరిందని వార్తలు వినిపించాయి. మరోవైపు, ఈ సినిమా సీక్వెల్‌లో ఆమె పాత్ర కేవలం కెమియో లాగ చిన్నగా ఉందంటూ అభిప్రాయాలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
Deepika Padukone Reacts on Kalki 2 issue
అయితే, దీపికా ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేయడం మరింత ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. షారుక్ ఖాన్ చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసిన దీపికా “నా కెరీర్ ప్రారంభంలో ఒం శాంతి ఒం సమయంలో షారుక్ నాకు చెప్పిన మొదటి విషయం - సినిమా విజయానికంటే, షూటింగ్ సమయంలో వచ్చే అనుభవం, మనతో పనిచేసే వ్యక్తులే ముఖ్యమని. ఆ మాటలు అప్పటి నుంచి ప్రతి నిర్ణయానికి ఆధారంగా పెట్టుకున్నా. అందుకే మేమిద్దరం ఇప్పుడు 6వ సినిమా చేస్తున్నాం” అంటూ ఎమోషనల్ నోట్ పెట్టింది. #King, #Day1 అంటూ ట్యాగ్ చేస్తూ షారుక్ ఖాన్ తో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.
ఈ పోస్టుపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమె ధైర్యానికి ప్రశంసలు కురిపించారు. "మొత్తానికి స్పందించావ్, లవ్ యూ!" అంటూ ఒకరు, "నిన్నెవరూ తగ్గించలేరు" అంటూ మరొకరు కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌పై రణవీర్ సింగ్ వేసిన కామెంట్ హైలైట్ అయ్యింది – “Bestest Besties!” అంటూ స్పందించాడు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంపై స్పందిస్తూ, “జరిగిన దాన్ని మార్చలేము. కానీ తర్వాత ఏం జరగాలనేది మనమే నిర్ణయించవచ్చు” అంటూ పరోక్షంగా స్పందించారు. మొత్తానికి, దీపికా పదుకునే ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె చేసే పోస్టులు, సినిమా ఎంపికలు అన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌లుగా మారాయి. ఆమెకు కథ, షూటింగ్ అనుభవం, పని చేసే వారితో రిలేషన్ మేటర్ అవుతుందని ఆమె క్లారిటీగా తెలియజేస్తోంది.