/rtv/media/media_files/2025/05/14/hbJpdJuePTh9Owtreyue.jpg)
Deepika Padukone latest pic
కొన్ని రోజుల క్రితమే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కూ దీపిక ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ గౌరవం దక్కిన తొలి భారతీయ నటి దీపిక పడుకోన్ మాత్రమే. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకుంది. ఫేమస్ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచింది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం లాంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్ ను రూపొందించారు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, హాలీవుడ్ యాక్టెరెస్ ఏంజెలీనా జోలీ, సెలీనా గోమెజ్ వంటి వారున్నారు.
20 ఏళ్ళుగా సినిమాలు..
దీపికా పడుకోన్ బాలీవుడ్ లోనే కాక అంతర్జాతీయంగా పేరు సంపాదించుకుంది. హాలీవుడ్, కేన్స్ వంటి వాటిల్లో తనదైన మార్క్ వేసింది. 018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్’ లిస్ట్‌లోనూ ఆమె చోటు దక్కించుకుంది. 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆకర్షించింది. దాదాపు 20 ఏళ్ళ నుంచీ దీపికా సినిమాలు చేస్తోంది. తాజాగా ఈమెకు పాప పుట్టింది. దీని తరువాత అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమాలో దీపికా నటిస్తోంది.