నందమూరి బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి "డాకు మహారాజ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 12న ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. 'వాల్తేరు వీరయ్య' తో మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ ఏ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ పాట, టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త సాంగ్ విడుదలైంది. "చిన్ని.. చిన్ని.." అంటూ సాగే ఈ పాట ను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. తమన్ కంపోజిషన్ లో బాలీవుడ్ సింగర్ విశాల్ మిశ్రా ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. A timeless bond we all hold dear is here to touch our hearts again 😍♥️#DaakuMaharaaj Second Single #Chinni out now 🎧- https://t.co/q0qkUFEMdRA @MusicThaman Musical 💕🎹A @dirbobby Film 💥Lyrics by @IananthaSriram ✍️Sung by @VishalMMishra 🎤In Cinemas Worldwide from… pic.twitter.com/J57EQ9kPfp — Sithara Entertainments (@SitharaEnts) December 23, 2024 అనంత్ శ్రీరామ్ ఎమోషనల్ లిరిక్స్ కు విశాల్ మిశ్రా గాత్రం పాటను మరింత ఆకట్టుకునేలా చేసింది. ఈ పాటలో ఒక చిన్న పాప ఎమోషనల్ సన్నివేశాలను బట్టి చూస్తే సినిమాలో యాక్షనే కాకుండా ఎమోషన్ కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌటేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.