Daaku Maharaaj: డాకూ మహరాజ్ లో ఊహించని సర్ ప్రైజ్.. థియేటర్స్ లో ఎగిరిగంతేస్తున్న ఫ్యాన్స్!

నేడు రిలీజైన 'డాకూ మహరాజ్' సినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. దబిడి, దిబిడి పాటకు బాలయ్య, శేఖర్ మాస్టర్, బాబీ కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

New Update

బాలయ్య, బాబీ, శేఖర్ మాస్టర్ 

అయితే వీటితో పాటు ఈ సినిమాలో ఫ్యాన్స్ కు ఊహించని మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. సినిమాలోని స్పెషల్ సాంగ్ దబిడి.. దిబిడి పాటలో బాలయ్యతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, డైరెక్టర్ బాబీ స్పెషల్ ఆపియరెన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు  దబిడి.. దిబిడి పాటకు స్టెప్పులేశారు. దీంతో థియేటర్లు  ఫ్యాన్స్ అరుపులు, కేకలతో మారుమోగాయి. బాలయ్యతో పాటు బాబీ, శేఖర్ స్టెప్పులేస్తుంటే జనం విజిల్స్ వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ,  సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.  ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్  చాందిని చౌదరి, ఊర్వశి రౌతేల ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. బాలీవుడ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు.  ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 'డాకూ మహారాజ్'  సినిమాతో హ్యాట్రిక్ బ్రేక్ చేశాడని ఫ్యాన్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు