Coffee with a Killer: హీరో హీరోయిన్లు లేని ఆర్ఫీ పట్నాయక్ మూవీ.. నేరుగా ఓటీటీలో!

ఆర్ఫీ పట్నాయక్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'కాఫీ విత్ ఏ కిల్లర్'. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update

సినిమా స్టోరీ ఏంటి..? 

ఒక కాఫీ షాపులో వివిధ వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. అందరూ కమెడియన్ అనుకునే ఒక కిల్లర్, ఓ పోలీస్ ఆఫీసర్, సినిమా తీయాలని కలలు కనే ఓ బ్యాచ్, డేట్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన ఓ కపుల్ ఇలా కాఫీ షాపుకు వచ్చిన రకరకాల వ్యక్తులతో ఈ సినిమా కథ ముడిపడి ఉంటుంది. గతంలోనూ ఆర్ఫీ పట్నాయక్ పలు సినిమాలు చేశారు. అందమైన మనసులో, బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, తులసీ దళం, మనలో ఒకడు లాంటి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి.  1999లో  'నీకోసం' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆర్ఫీ పట్నాయక్.. ఆ తర్వాత నటుడు, డైరెక్టర్ గా పలు సినిమాలు చేశారు. 

Also Read: Sai Pallavi:  తండేల్ జాతర.. చైతన్యతో సాయి పల్లవి చిట్ చాట్.. చై కోసం పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్

Advertisment
తాజా కథనాలు