BREAKING: సినీ కార్మికులకు బిగ్ షాక్.. ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చలు విఫలం

నేడు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల ఫెడరేషన్ చర్చలు జరగ్గా విఫలమయ్యాయి. సినీ కార్మికుల డిమాండ్లను నిర్మాతలు అంగీకరించడం లేదు. సినీ కార్మికులు తమకు 30 శాతం వేతనాలు పెంచాలని చేపట్టిన సమ్మె మరికొన్ని రోజులు కొనసాగనుంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

సినీ కార్మికులు తమకు 30 శాతం వేతనాలు పెంచాలని చేపట్టిన సమ్మె 10వ రోజు కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వరకు షూటింగ్స్ అన్ని కూడా పూర్తిగా బంద్ అయ్యాయి. సినీ కార్మికుల డిమాండ్లను నిర్మాతలు (Producers) అంగీకరించడం లేదు. దీంతో నేడు ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber), నిర్మాతల ఫెడరేషన్చ (Federation) ర్చలు జరగ్గా విఫలమయ్యాయి. వీరి మధ్య ప్రతిపాదనలు కొలిక్కి రావడం లేదు. గురువారం, శుక్రవారం కూడా మీటింగ్స్ జరుగుతాయని నిర్మాత సి కళ్యాణ్ (Producer kalyan) తెలిపారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్లకు పర్సంటేజ్ పెంచలేమని నిర్మాతలు చెప్పేశారు. సమ్మె కొనసాగించెందుకు తాము సిద్దమేనని నిర్మాతలు () తెలిపారు. దీంతో మరికొన్ని రోజుల పాటు సమ్మె కొనసాగనుంది.

ఇది కూడా చూడండి: Coolie Monica Song: ఇది కదా కిక్ అంటే..! కూలీ 'మోనికా' సాంగ్ పై హాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

వేతనాలు పెంచితేనే షూటింగ్స్ లేకపోతే..

వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్‌లో (Shootings) పాల్గొంటామని తెలుగు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని తెలిపింది. గత మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోవడం, పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవనం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ డిమాండ్‌ను అంగీకరించని నిర్మాతల సినిమాల షూటింగ్‌లకు ఆగస్టు 4 నుంచి హాజరుకాకూడదని ఫెడరేషన్ (Federation) నిర్ణయించింది. కేవలం హైదరాబాద్‌లోని (Hyderabad) షూటింగ్‌లకు మాత్రమే ఈ బంద్ కాదు. తెలుగు సినిమా షూటింగ్‌లు ఎక్కడ జరిగినా కూడా వర్తిస్తుంది. 30 శాతం వేతనాలు పెంచిన తర్వాత ఎప్పటి వేతనాలు అప్పుడే చెల్లిస్తామని రాతపూర్వకంగా చెప్తే షూటింగ్‌లు జరుగుతాయని తెలిపారు. ఈ రూల్స్ పాటించకుండా ఎవరైనా షూటింగ్‌లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయి. 

తెలుగు ఫిలిం ఫెడరేషన్ లేఖలో పేర్కొన్న డిమాండ్స్

వేతనాలు పెంపు విషయం లో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ లుగా సయ్యద్ హ్యూమయున్, వీరశంకర్‌ని నియమించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 30% వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించడమైనది. 30% వేతనాలు ఇస్తామని, ప్రొడ్యూసర్ (Producer) నుండి సంభందిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంభందిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్ లకు తెలియజేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్లాలని నిర్ణయించడమైనది. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సంబందించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు గాని, వెబ్ సిరీస్ ల షూటింగ్ లకు గాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ (telugu Film Industry) ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Employees Federation) నుండి అనుమతి లేనిదే ఎటువంటి విధులకు యూనియన్/అసోసియేషన్ సభ్యులు (Assosation members) హాజరు కాకూడదని నిర్ణయించడమైనది. ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించును. 

ఇది కూడా చూడండి: Coolie First Review: ఉదయనిధి స్టాలిన్‌ 'కూలీ' ఫస్ట్ రివ్యూ.. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్!

Advertisment
తాజా కథనాలు