Veera Dheera Soora 2: అరుణ్ కుమార్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. గతనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఎస్.జే సూర్య, దుషారా విజయన్, సూరజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేసింది.
Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!
#VeeraDheeraSooran Part 2 premieres April 24 on Prime Video.
— Ott Updates (@Ott_updates) April 18, 2025
Starring - Chiyaan Vikram, Dushara Vijayan, Suraj Venjarmoodu & S J Suryah.#VeeraDheeraSooran2OnPrime pic.twitter.com/4Q2N8oHyh1
విడుదల రోజే చిక్కులు
ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదల రోజే ఓటీటీ హక్కులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. లీగల్ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీ ప్లెక్సుల్లో ఫస్ట్ షోలు రద్దయ్యాయి. దీంతో సదరు థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి పంపిస్తామంటూ సందేశాలు పంపించారు. ఆ తర్వాత నిర్మాతలు సమస్యను పరిష్కరించడంతో యదావిధిగా థియేటర్స్ లో సినిమా స్క్రీనింగ్ జరిగింది.
latest-news | cinema-news | Veera Dheera Sooran
Also Read: Health Tips: మీకు మాట్లాడుతూ భోజనం చేసే అలవాటు ఉందా?.. ఈ 5 షాకింగ్ విషయాలు తప్పక తెలుసుకోండి!