చిరంజీవి లండన్‌ పర్యటనలో గోల్‌మాల్‌.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు!

చిరంజీవి లండన్‌ పర్యటనలో గోల్‌మాల్‌ జరిగింది. చిరంజీవి టూర్‌ను క్యాష్ చేసుకునే పనిలో కొందరు కేటుగాళ్లు పడ్డారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

New Update
chiranjeevi London tour

మెగాస్టార్ చిరంజీవి లండన్‌ పర్యటనలో గోల్‌మాల్‌ జరిగింది. ఆయన టూర్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు కొందరు కేటుగాళ్లు . ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను కలవడానికి ఎవరూ డబ్బులు కట్టక్కర్లేదని ట్వీట్ చేశారు . ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని మెగాస్టార్ వెల్లడించారు.  అభిమానాన్ని ఎవరూ కొనలేరంటూ చిరు భావోద్వేగ పోస్ట్ పెట్టారు.  లండన్ లో తనను కలవాలని మీరు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత తనను ఎంతగానో కదిలించిందన్నారు.  

చిరంజీవికి  లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారం

కాగా మెగాస్టార్ చిరంజీవికి  లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ప్రదానం  చేస్తూ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు.  నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.  యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరగగా...  పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గతేడాది చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు, ఏయన్నార్‌ నేషనల అవార్డు, ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా)- అవుట్‌ స్టాండింగ్‌ అఛీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా అవార్డులు  దక్కాయి.  

Also Read :  అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు