/rtv/media/media_files/2025/02/21/SzFzb60DPlqQP4cIcxmm.jpg)
anjana devi
Chiranjeevi Mother: చిరంజీవి తల్లి అంజనా దేవి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు ఉదయం నుంచి పలు మీడియా కథనాల్లో వార్తలు వచ్చాయి. దీంతో మెగాస్టార్, పవన్ కళ్యాణ్ తమ పనులను మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ బయలుదేరినట్లు కూడా ప్రచారం జరిగింది.
The news about #Anjanamma Garu's health is completely false.
— Telugu Bit (@Telugubit) June 24, 2025
She is healthy, doing well. #Chiranjeevi #Pawankalyan pic.twitter.com/1zoIzYzlgP
అంజనా దేవి ఆరోగ్యంపై కీలక అప్డేట్
ఈ క్రమంలో మెగాస్టార్ టీమ్ అంజనా దేవి ఆరోగ్యం పై కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే మెగాస్టార్ శామీర్ పేట్ లో జరుగుతున్న అనిల్ రావిపూడి షూటింగ్ కి వెళ్లినట్లు తెలిపారు. దీంతో మెగా అభిమానులు, చిర్నజీవి సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ క్యారెక్టర్ గ్యాంగ్ స్టార్, మెకానిక్ అల్లుడు పాత్రల తరహాలో ఉండబోతుందని అనిల్ క్లారిటీ ఇచ్చారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు.
దీంతో పాటు చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ త్రిష, చిరంజీవి జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. UV క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Also Read: Fire Breaks Film City: ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన సెట్ - షాకింగ్ వీడియో