ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇవాళ (శనివారం) హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో మీట్ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే.
కోటి విరాళం
దీంతో వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి రూ.కోటి ప్రకటించారు. ఇప్పుడు ఆ విరాళం చెక్‌ను చంద్రబాబుకు అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల తరఫున చిరంజీవి, రామ్ చరణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం నీట మునిగింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గోవులు వరదల్లో కొట్టుకుపోయాయి. రెండు మూడు రోజులు తినడానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు.
అందులో మెగాస్టార్ చిరు అండ్ చరణ్ ఒకరు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా తమవంతు సాయం చేసేందుకు ముందుంటారు ఈ తండ్రీ కొడుకులు. ఇందులో భాగంగానే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరు రూ.50 లక్షలు, చరణ్ రూ.50 లక్షలు ప్రకటించారు. ఇప్పుడా చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశాడు.
ఇది కూడా చదవండి: ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే?
కాగా ప్రజలు ఇబ్బందులో ఉన్న ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ సాయం చేసేందుకు ముందుంటుంది. సినీ పరిశ్రమ నుంచి కూడా తనవంతు సహాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నారు. ఇటీవలే కేరళలో కొండచరియలు విరిగి చాలా మంది చనిపోయారు. ఆ సమయంలో కూడా మెగాస్టార్ చిరు తన వంతు సాయం ప్రకటించాడు. అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తితే.. చిరు రూ.50 లక్షలు, చరణ్ రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళం ప్రకటించారు.