సీఎం చంద్రబాబుని కలిసిన చిరంజీవి.. కారణం ఏంటంటే? ఏపీ సీఎం చంద్రబాబుని టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. చిరంజీవి, రామ్ చరణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. By Seetha Ram 12 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇవాళ (శనివారం) హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో మీట్ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. కోటి విరాళం దీంతో వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి రూ.కోటి ప్రకటించారు. ఇప్పుడు ఆ విరాళం చెక్‌ను చంద్రబాబుకు అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల తరఫున చిరంజీవి, రామ్ చరణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం నీట మునిగింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గోవులు వరదల్లో కొట్టుకుపోయాయి. రెండు మూడు రోజులు తినడానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. I extend my heartfelt thanks to Megastar @KChiruTweets Garu and @AlwaysRamCharan Garu for their generous contribution of ₹1 crore towards the Chief Minister's Relief Fund. Chiranjeevi Garu has always been at the forefront of humanitarian efforts, consistently offering his… pic.twitter.com/RXPPUojZax — N Chandrababu Naidu (@ncbn) October 12, 2024 అందులో మెగాస్టార్ చిరు అండ్ చరణ్ ఒకరు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా తమవంతు సాయం చేసేందుకు ముందుంటారు ఈ తండ్రీ కొడుకులు. ఇందులో భాగంగానే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరు రూ.50 లక్షలు, చరణ్ రూ.50 లక్షలు ప్రకటించారు. ఇప్పుడా చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశాడు. ఇది కూడా చదవండి: ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే? కాగా ప్రజలు ఇబ్బందులో ఉన్న ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ సాయం చేసేందుకు ముందుంటుంది. సినీ పరిశ్రమ నుంచి కూడా తనవంతు సహాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నారు. ఇటీవలే కేరళలో కొండచరియలు విరిగి చాలా మంది చనిపోయారు. ఆ సమయంలో కూడా మెగాస్టార్ చిరు తన వంతు సాయం ప్రకటించాడు. అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తితే.. చిరు రూ.50 లక్షలు, చరణ్ రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళం ప్రకటించారు. #chandrababu #chiranjeevi #ram-charan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి