Actor Sivaji: 'మంగపతి'తో మెగాస్టార్.. 'కోర్ట్' మూవీకి చిరు ఫిదా!

కోర్టు మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 'మంగపతి' పాత్రలో అదరగొట్టిన శివాజీని స్వయంగా ఇంటికి పిలిచి అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివాజీ తన ఎక్స్ లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

New Update

Actor Sivaji: దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత  'మంగపతి' పాత్రతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు యాక్టర్ శివాజీ. ఒకప్పుడు హీరోగా, విలన్ గా, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన శివాజీ .. 2016 తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో ఎన్నో, కథలు పాత్రలు ఆయన కోసం వచ్చినప్పటికీ చేయలేదు. దాదాపు పదేళ్ల పాటు ఒక మంచి పాత్ర కోసం ఎదురుచూశారు.  అప్పుడొచ్చింది  'కోర్ట్'  మూవీలో  'మంగపతి' పాత్ర.  ఇందులో  'మంగపతిగా' శివాజీ నటన అభిమానులు ఫిదా చేసింది.  న‌టించాడు అన‌డం క‌న్నా జీవించాడు అని చెప్పొచ్చు. అంతలా ఆకట్టుకుంది మంగపతి పాత్ర.  నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అదరగొట్టారు. ఇన్నాళ్లుగా వెండితెరపై శివాజీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్ కి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలెబ్రెటీల వరకు అంతా శివాజీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మెగాస్టార్ ప్రశంసలు.. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కూడా అందుకున్నారు. కోర్ట్’ సినిమా చూసిన  మెగాస్టార్.. 'మంగపతి' పాత్రకు  ఫిదా అయ్యారు. శివాజీని స్వయంగా ఇంటికి పిలిచి అభినందనలు తెలియజేశారు మెగాస్టార్. అనంతరం శివాజీ చిరంజీవితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివాజీ తన ఎక్స్ లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ''ఈ క్షణం నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా ప్రియమైన అన్నయ్య చిరంజీవి  ‘కోర్ట్’ సినిమా చూసి..  మంగపతిని, టీమ్ మొత్తాన్ని అభినందించారు'' అంటూ ట్వీట్ చేశారు. ఇంద్ర, మాస్టర్ సినిమాల్లో శివాజీ.. చిరంజీవితో కలిసి నటించారు. 

చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయాన్ని అందుకుంది 'కోర్ట్' మూవీ. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.  మంచి కంటెంట్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, నటీనటుల పర్ఫామెన్స్ సినీ ప్రియులను ఫిదా చేసింది. తాజాగా ఈమూవీ పై మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. 

 latest-news | court | cinema-news | actor-shivaji | chiranjeevi 

ఇది కూడా చదవండి:Pastor Praveen: నా భర్త చాలా మంచోడు.. కన్నీరు పెట్టిస్తోన్న ప్రవీణ్ భార్య మాటలు!

Advertisment
తాజా కథనాలు