New Update
అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్ర సికింద్రాబాద్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన భార్య జెస్సికా పగడాల ఎమోషనల్ కామెంట్స్ చేశారు. భర్తను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త చాలా మంచివాడు, సౌమ్యుడన్నారు. తనను హత్య చేసిన వాళ్లను కూడా క్షమించే అంత మంచివాడన్నారు. మేం కూడా ప్రవీణ్ బాటలోనే నడుస్తామన్నారు. పగలు, ప్రతీకారాలకు పోమని స్పష్టం చేశారు. తాను, తన పిల్లలు ప్రవీణ్ సేవలను కొనసాగిస్తామన్నారు.
తాజా కథనాలు