Laila Pre Release
చీఫ్ గెస్టుగా మెగాస్టార్..
'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి నేడు చిరంజీవిని కలిసి స్వయంగా ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.
A MEGA EVENT LOADING 🔜
— Shine Screens (@Shine_Screens) February 7, 2025
'Mass Ka Das' @VishwakSenActor & our producer @sahugarapati7 met MEGASTAR @KChiruTweets Garu and cordially invited him to the #Laila pre release event as the chief guest 🌟
More details soon! Stay tuned 💥#LailaTrailer TRENDING #1 on YouTube 🔥
▶️… pic.twitter.com/VpNC5LIlOW
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవలే రిలీజైన ఓహో రత్తమ్మా' సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. ఈ పాట మధ్యలో రీసెంట్ గా వైరలైన 'కోయ్ కోయ్ కోడ్ని కోయ్' అనే లిరిక్ ని యాడ్ చేయడం మరింత హైలైట్ అయ్యింది. లైలా చిత్రానికి లియో జేమ్స్ సంగీతం అందించారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
Also Read: Saif Ali khan Attack: సైఫ్ ను పొడిచింది వాడే.. పోలీసుల ముందే గుర్తు పట్టిన పని మనుషులు!