Karnataka: కన్నడ నటులు దర్శన్, పవిత్ర గౌడ్‌లకు బెయిల్

రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడలకు బెయిల్ మంజూరు అయింది. కర్ణాటక హైకోర్టు ఈరోజు వీరిద్దరితో పాటూ మరో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

New Update
darshan 11

కన్నడ నటుడు దర్శన్‌ మొత్తానికి జైలు నుంచి బయటపడ్డారు. ఇంతకు ముందే ఇతనికి ఆరోగ్య సమస్యల కారణంగా కోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు దానిని మరింత పొడిగిస్తూ  కర్ణాటక హైకోర్టు పూర్తి బెయిను మంజూరు చేసింది. దర్శన్‌తో పాటూ అతని ప్రియురాలు పవిత్ర గౌడ మరో ఐదుగురు నిందితులు మరో ఐదుగురు నిందితులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే కర్ణాటక హైకోర్టు నిందితులందరికీ షరుతులతో కూడిన బెయిల్‌ను మంజురు చేసింది. నిందితులు కోర్టు అధికార పరిధిని విడిచిపెట్టలేదరని, సాక్ష్యుల్ని సంప్రదించొద్దని, వారిని భయపెట్టొద్దని ఆదేశించింది. 

తన ఫ్యాన్ రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.  దర్శన్‌తో సన్నిహితంగా ఉంటున్న కారణంగా రేణుకాస్వామి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజులు పంపించడంతో..వద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో నటుడు దర్శన్ అతనిని హత్య చేయించాడు. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, దర్శన్ అనుచరులు బెంగళూర్ తీసుకువచ్చారు. బెంగళూర్‌లోని కామాక్షి పాళ్య ప్రాంతంలోని షెడ్‌లో బంధించి దారుణంగా దాడి చేయడంతో అతను మరణించాడు.

Also Read: Breaking: అల్లు అర్జున్ విడుదల రేపే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు