Brahmanandam: నా లెగసీ కంటిన్యూ చేసేది అతనే.. అందుకే సినిమాలు తగ్గించేశా : బ్రహ్మనందం

వయసు పైబడటం వల్లే తాను సినిమాలు ఎక్కువగా చేయడం లేదని కామెడీ కింగ్ బ్రహ్మానందం అన్నారు. వ‌య‌సును దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత‌కుముందు చేసిన‌ట్లు ఇప్పుడు చేయాలంటే కుద‌ర‌దు. అందుకే సినిమాలు త‌గ్గించాను తప్పితే నాకు అవకాశాలు రాక కాదని తెలిపారు.

New Update
brahmanandam

brahmanandam

కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ యాదవ్ న క్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read :  సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!

తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్రహ్మానందం, గౌతమ్, వెన్నెల కిషోర్ తో పాటూ దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం తాను సినిమాలు ఎక్కువగా చేయకపోవడంపై నోరు విప్పారు. ఆయన మాట్లాడుతూ.." ఈ మ‌ధ్య కొంద‌రూ అంటున్నారు. అలాగే, గతంలో చేసినంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం నా వయస్సు. 

మన వయస్సును అనుసరించి మనం వ్యవహరించాలి. గతంలో నేను చాలా చురుకుగా నటించేవాడిని, కానీ ఇప్పుడు శరీరానికి ఆ శక్తి ఉండడం లేదు. అందుకే సినిమాల సంఖ్య తగ్గించాను. అవకాశాలు లేకపోవడం లేదా చేయలేనని కాదు, నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అన్న ప‌దాలు మెడ‌లో త‌గిలించుకోవ‌డానికే ప‌నికి వ‌స్తాయి. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌ల్ని మ‌నం చెక్ చేసుకుంటూ ఉండాలి.." అంటూ చెప్పుకొచ్చారు. 

Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

అయితే ఇదే ఈవెంట్ లో కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి బ్రహ్మానందం మాట్లాడుతూ.. కిషోర్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని, సినిమాలోని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతని టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ కి మధ్యలోనే నవ్వొచ్చేదని ఆ టాలెంట్ అందరిలో ఉండదని అన్నారు. అంతేకాకుండా నా తర్వాత నెక్స్ట్ నా లెగసీని కంటిన్యూ చేసేది కూడా అతనే అని వెన్నెల కిషోర్ పై ప్రశంసలు కురిపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు