తొక్కుడు.. నరుకుడు.. సీన్ల మధ్య బీభత్సమైన BGM.. బాలయ్య బాబు ఎగిరితంతే విలన్లు 100 అడుగుల దూరంలో పడతారు. బోయపాటి (Boyapati Srinu), బాలకృష్ణ (Balakrishna) మెంటల్ మాస్ కాంబో అలా ఉంటుంది మరి! ఇప్పటికీ ఈ ఇద్దరి కాంబోలో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్! ఇప్పుడు మరో సినిమాకు సంబంధించిన పూజా ఈవెంట్ గ్రాండ్గా మొదలైంది. ఈ సందర్బంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్కి అఖండ-2 (Akhanda 2) టైటిల్‌తో పాటు తాండవం అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్‌కు పూనకాలు ఓ రేంజ్‌లో మొదలయ్యాయి.
Also Read: ఏపీకి మేం పోము.. ఆమ్రపాలితో పాటు ఆ IASల భయమిదే?
అఖండ అదిరే హిట్..
అఖండ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో బాలయ్య ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌కు అభిమానులు శివాలెత్తిపోయారు. ముఖ్యంగా ఆ సినిమాలో యాక్షన్ సీన్స్‌కు వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు థియేటర్ దద్దరిల్లిపోయింది. అందరిలో ఒకటే వైబ్రెషన్స్ వచ్చాయి. ఇక సీక్వెల్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అటు ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే విషయం మరొకటి ఉంది. అఖండ సినిమా ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడే నుంచే ఈ సీక్వెల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక ఈసారి పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట బోయపాటి.
Also Read: ఒమర్ అబ్దుల్లాతో కలిసి పనిచేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో బాలయ్య-బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ సమయంలో బాలకృష్ణ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ సినిమాకు కలెక్షన్లు అంతకంతకూ దిగజారుతూ వచ్చాయి. అదే సమయంలో బాలయ్య-బోయపాటి కాంబోలో సింహా సినిమా రిలీజ్ అయ్యింది. ఇది బాలకృష్ణకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా బాలకృష్ణను మరోసారి ఫ్లాపులు వేధించాయి. ఇక అప్పుడు కూడా ఈ ఇద్దరి కాంబోలో లెజెండ్ వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. మాస్ డైలాగులతో పాటు పొలిటికల్ పంచ్‌లతో నాడు లెజెండ్ సృష్టించిన అరాచకం అంతాఇంతా కాదు.
సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య-కాంబో కాంబినేషన్‌లో అఖండ వచ్చింది. ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ వేసిన డైలాగులకు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయి. ' ఒకసారి డిసైడై బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్‌ని తొక్కి పార దొబ్బుతా.!' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అయితే నెక్ట్స్ లెవల్. 'నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకే పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్..' అని బాలయ్య చెప్పిన మరో డైలాగ్ నాడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
Also Read: ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు
ఇలా మూడు సినిమాల్లోనూ ఈ మెంటల్ మాస్ కాంబో బాలయ్య ఫ్యాన్స్‌కు కావాల్సినంతా బిర్యానీ విత్ ఫుల్ మీల్స్ ఇచ్చింది. అయితే ఈ ఇద్దరి కాంబోను విమర్శించేవారు కూడా ఉన్నారు. లాజిక్ లేకుండా సీన్లు ఉంటాయని బోయపాటిని నెట్టింట ట్రోల్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. బెసిక్ సైన్స్ సూత్రాలకు విరుద్ధంగా ఆయన సీన్లు చిత్రీకరిస్తారని.. న్యూటన్ కనుగొన్న గ్రావిటీ సిద్ధాంతాన్ని అవమానపరిచేలా ఈ ఇద్దరి కాంబోలో ఫైట్స్ ఉంటాయని నెటిజన్లు చురకలంటిస్తుంటారు. అటు హింసాత్మక సీన్లు కూడా హద్దుమీరి ఉంటాయని చెబుతుంటారు. సినిమాలో ఎరుపురంగుకు ఇచ్చిన ప్రాధాన్యత కథకు ఇవ్వరన్న విమర్శలున్నాయి. ఇక అఖండ సినిమాలో థమన్ ఇచ్చిన బీజీఎం చాలా చోట్ల సీన్లను డామినేట్ చేసిందనీ, అనవసమైన బీభత్సాన్ని క్రియేట్ చేశారని విమర్శిస్తుంటారు. అయితే ఎన్ని విమర్శలు ఉన్నా ఈ ఇద్దరి కాంబో కోసం మాత్రం వెయిట్ చేసే వారూ చాలా ఎక్కువే ఉండడం వారి క్రేజ్‌కు నిదర్శనం.