Nirmal Kapoor : బోనీ కపూర్ ఇంట విషాదం.. నిర్మల్ కపూర్ కన్నుమూత!

బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది.  నటులుఅనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి,నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. శుక్రవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

New Update
nirmal kapoor

nirmal kapoor

బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది.  నటులుఅనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి,నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. శుక్రవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని అనిల్ కపూర్ ఇంటికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతపట్ల సంతాపం తెలుపుతున్నారు.  నిర్మల్ కపూర్ 2024సెప్టెంబర్ లో తన 90వ పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రస్తుతానికి, ఆమె మరణం గురించి కపూర్ కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

సురీందర్ కపూర్‌ను వివాహం

 నిర్మల్ కపూర్ ప్రముఖ చిత్ర నిర్మాత అయిన సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు - అనిల్ కపూర్, రీనా కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్. నిర్మల్ మనవళ్లలో సోనమ్ కపూర్ , రియా కపూర్ , హర్షవర్ధన్ కపూర్, జాన్వి, ఖుషి, అన్షు, అర్జున్ కపూర్, షానయ కపూర్, జహాన్ కపూర్ ఉన్నారు. కాగా  కొంతకాలం క్రితం, అనిల్ కపూర్ తన 'జగ్ జగ్ జీయో' చిత్రం ప్రమోషన్ల సందర్భంగా కియారా అద్వానీ, వరుణ్ ధావన్, నీతు కపూర్‌లతో కలిసి ఒక రియాలిటీ షోలో కనిపించినప్పుడు, అతను తన తల్లినిర్మల్ కపూర్ ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 

Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO

Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!

Advertisment