/rtv/media/media_files/2026/02/08/bollywood-stars-2026-02-08-20-19-02.jpg)
ముంబై వేదికగా జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో బాలీవుడ్ తారలు(bollywood-stars) మెరిశారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండే బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ వేడుకల్లో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mumbai, Maharashtra: On RSS Centenary Year Event, Actor Vicky Kaushal says, "It’s wonderful that the RSS journey has completed 100 years. For the first time, I got to hear Mohan Bhagwat speak in person, and I was deeply impressed..." pic.twitter.com/6QdWSQJVwj
— IANS (@ians_india) February 8, 2026
Salman Khan attends RSS centenary in Mumbai.
— Team Rising Falcon (@TheRFTeam) February 7, 2026
Celebrities with Muslim names showing up at events run by groups accused of spreading hate against Muslims while their own community faces discrimination raises serious questions.
Silence and symbolism both matter. pic.twitter.com/GtOwJR9GLF
Also Read : డ్రగ్స్ కేసులో హీరోయిన్ అరెస్ట్
Bollywood Stars Attend RSS Centenary Celebrations
ముంబైలోని వర్లీలో ఉన్న నెహ్రూ సెంటర్‌లో ‘100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ: న్యూ హారిజాన్స్’ పేరిట రెండు రోజుల పాటు ఈ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. RSS సరసంఘచాలక్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ్ సిద్ధాంతాలు, దేశాభివృద్ధిలో దాని పాత్రపై చర్చలు జరిగాయి. ఈ వేడుక(RSS centenary celebrations) లకు బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు క్యూ కట్టారు. సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, జాకీ ష్రాఫ్ అక్కడ సందడి చేశారు. అలాగే నటి హేమ మాలిని, రవీనా టాండన్, శిల్పా శెట్టి, అనన్యా పాండే, పూనమ్ ధిల్లాన్, రూపాలి గంగూలీలు కూడా ఉత్సవాలకు హాజరైయ్యారు.
🚨 Shilpa Shetty attends RSS 100 Years event, says she is a huge fan of Mohan Bhagwat.
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 8, 2026
Bollywood names who attended the 100 Years of Sangh journey so far:
— Salman Khan
— Ranbir Kapoor
— Akshay Kumar
— Ananya Panday
— Karan Johar
— Vicky Kaushal
— Shilpa Shetty
— Raveena Tandon… pic.twitter.com/TkNN21JQZ4
Mumbai, Maharashtra: On RSS Centenary Year Event, Film director Karan Johar says, "I really enjoyed attending today’s RSS Centenary celebration. Listening to Bhagwat Ji’s thoughts and ideas was inspiring. We sincerely thank him for giving Bollywood personalities so much time.… pic.twitter.com/uVMLmQgfDD
— IANS (@ians_india) February 8, 2026
Also Read : పాపం 'రాజాసాబ్'.. ఓటిటిలోనూ ఎడాపెడా ఆడేసుకుంటున్నారుగా..!
ఇక దర్శక-నిర్మాతల విషయానికి వస్తే కరణ్ జోహార్, సుభాష్ ఘయ్, మాధుర్ భండార్కర్, నితీష్ తివారీ, ఓం రౌత్, ఆనంద్ ఎల్ రాయ్ ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అద్నాన్ సమీ, సంగీత దర్శకుడు ప్రీతమ్, గేయ రచయిత ప్రసూన్ జోషి కూడా వచ్చారు. ఈ రెండు రోజుల్లో కొందరు శనివారం హాజరుకాగా, మరికొందరు ఆదివారం ఉత్సవాల్లో పాల్గొన్నారు. వీరంతా ఆరెస్సెస్ అగ్ర నేతలతో కలిసి సామాజిక అంశాలపై చర్చిస్తూ కనిపించారు. మోహన్ భగవత్(rss chief mohan bhagwat) ప్రసంగాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా వినడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక హిందూత్వ భావజాలం ఉన్న సంస్థ వేడుకలకు గ్లామర్ ప్రపంచానికి చెందిన ఇంతమంది తారలు హాజరవ్వడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ, దేశ సంస్కృతి, విలువలపై జరుగుతున్న ఈ శతాబ్ది చర్చలో భాగస్వామ్యం పంచుకోవడంతో వారు ఓ కొత్త సంకేతాన్ని ఇచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి తారల రాక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సంఘ్ గత వందేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు, ముంబై సినీ పరిశ్రమతో సంఘ్‌కు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసినట్లు కనిపిస్తోంది.
Follow Us