/rtv/media/media_files/2024/11/29/94TvwVhKu1h4hkByHv0u.jpg)
raj kundra
Porn Rocket : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. బాలీవుడ్ నివేదికల ప్రకారం రెడ్ మొబైల్ యాప్ ద్వారా పోర్న్ వీడియోలు సృష్టించడం, పంపిణీ చేసిన కేసు, మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో రాజ్ కుంద్రా నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. రాజ్ కుంద్రా నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: పుష్ప2 విషయంలో విజయ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!అదేంటో తెలుసా..?
గతంలో కేసు..
అయితే గతంలో 2021 లో అశ్లీల వీడియోలు తీయించి.. వాటిని విదేశీ యాప్స్ లో అప్లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై అతను బయటకు వచ్చారు. ముంబై పోలీసులు అప్పట్లో పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోని విచారిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ముఠా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కోసం షార్ట్ ఫిల్మ్స్ పేరుతో ఔత్సాహిక నటీనటులతో అశ్లీల వీడియో తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలు షూట్ చేసిన తర్వాత వాటిని వాటిని వీట్రాన్స్‌ఫర్ ద్వారా విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తారు. అయితే ఈ కేసు విచారణలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా... ఇందులో రాజ్‌కుంద్రా పేరు కూడా బయట పడింది. ఉమేశ్ కామత్ రాజ్‌కుంద్రా దగ్గర పనిచేసేవాడు. ఈ కేసు పూర్తి విచారణ తర్వాత ఆధారాలతో 2021 జులై 20న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా.. అతని కంపెనీ పోర్న్ చిత్రాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడంతో పాటు దేశంలోని చట్టాలను అధిగమించడానికి ఏర్పాట్లు చేసారు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
Also Read: లగచర్లలో భూసేకరణ నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
Also Read: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!