పుష్ప2 విషయంలో విజయ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!అదేంటో తెలుసా..?

అల్లు అర్జున్ విషయంలో మరో సారి విజయ్ తన సెటిమెంట్ ఫాలో అయ్యారు. 'పుష్ప 2' రిలీజ్ కి ముందు తన రౌడీ బ్రాండ్‌ నుంచి బన్నీకి కస్టమైజ్ టీ షర్ట్‌లను గిఫ్ట్ గా పంపించారు. గతంలో అలవైకుంటపురం, పుష్ప1 రిలీజ్ సమయంలో కూడా కస్టమైజ్ టీ షర్ట్‌లను గిఫ్ట్ చేశారు.

New Update

Vijay Deverakonda: అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. అయితే విజయ్ బన్నీ విషయంలో మరో సారి తన సెటిమెంట్ ఫాలో అయ్యారు. 'పుష్ప 2' రిలీజ్ కి ముందు తన ‘రౌడీ’ బ్రాండ్‌ కలెక్షన్స్‌ నుంచి ‘పుష్ప’ పేరుతో  కస్టమైజ్ చేసిన షర్ట్‌లను గిఫ్ట్ గా పంపించారు. ఈ ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ''నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు కృతజ్ఞతలు'' అంటూ తెలిపారు. దీనికి విజయ్  ''లవ్‌ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి'' అని రిప్లై ఇచ్చారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

విజయ్ సెంటిమెంట్ 

అయితే గతంలో  'అలవైకుంటపురం', 'పుష్ప పార్ట్1' రిలీజ్ సమయంలో కూడా విజయ అల్లు అర్జున్ కోసం తన రౌడీ బ్రాండ్ నుంచి బన్నీకి కస్టమైజ్ చేసిన టీ-షర్ట్ లను గిఫ్ట్ గా పంపించారు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అలా విజయ్ తనకు ఇదొక సెటిమెంట్ అని ఫీల్ అవుతారు. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఈవెంట్ లో కూడా ప్రస్తావించారు విజయ్. ఇది ఇలా ఉంటే..  పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఏకంగా 1000 పైగా థియేటర్లలో పుష్ప 2 రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు ఇండియన్ సినిమాలోనే పుష్ప బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది.  సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.  ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

Advertisment
Advertisment
తాజా కథనాలు