/rtv/media/media_files/2025/09/07/dhammu-srija-2025-09-07-19-57-18.jpg)
Dhammu Srija
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఓజీ సాంగ్‌తో స్టార్ట్ చేసి సోనియా సోనియా సాంగ్‌తో నాగార్జున అదరగొట్టారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటిగా సీరియల్ నటి తనూజ గౌడ్ వెళ్లగా సెకండ్ ఆశా సైనీ ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి ఈసారి సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా ఎంపికయ్యారు. ఐదుగురు కామనర్స్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే బిగ్ బాస్‌లోకి దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. వైజాగ్‌కు చెందిన ఈమె ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసే ఈమె బిగ్ బాస్ కోసం వదిలేసింది. లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి మరి బిగ్ బాస్‌లోకి వచ్చింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే రీల్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, ఆటను ఎలా ఆడుతుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీజ తన పేరుకు తగ్గట్టే హౌస్‌లో 'దమ్ము' చూపిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చూడండి:BIGG BOSS 9 TELUGU: బిగ్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ లోకి మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్రెండ్!
అగ్ని పరీక్షలో దుమ్ము రేపిన దమ్ము శ్రీజ..
'అగ్నిపరీక్ష' ఆడిషన్స్‌లో దమ్ము శ్రీజ విచిత్రమైన ప్రవర్తనతో జడ్జిలను ఆశ్చర్యపరిచింది. ఆమెను చూసి జడ్జిలైన అభిజిత్, బిందు మాధవి 'రెడ్ ఫ్లాగ్' ఇచ్చారు. అంటే ఆమె హౌస్‌లోకి వెళ్లడానికి అర్హురాలు కాదని సూచించారు. కానీ మరో జడ్జి నవదీప్ ఆమెకు ఒక అవకాశం ఇస్తూ 'గ్రీన్ ఫ్లాగ్' ఇచ్చి హోల్డ్‌లో పెట్టారు. ఆ ఒక్క అవకాశాన్ని శ్రీజ అద్భుతంగా ఉపయోగించుకుంది. 'అగ్నిపరీక్ష'లో నిర్వహించిన ప్రతి టాస్క్‌లో ఆమె అత్యుత్తమంగా ఆడింది. ఆమె పోరాట పటిమను చూసి జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు. అందుకే, ఆమెను నేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. ప్రేక్షకుల ఓటింగ్‌లో కూడా శ్రీజ అగ్రస్థానంలో నిలిచి, తన సత్తా చాటింది. ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి దమ్ము శ్రీజ ఎలా ఉంటుందో చూడాలి.