BIGG BOSS 9 TELUGU: ఊహించని ట్విస్ట్.. 'అగ్నిపరీక్ష' లో గెలిచింది వీళ్ళే! టాప్ 5 కామనర్స్ లిస్ట్ చూసేయండి

'అగ్నిపరీక్ష' లో గెలిచి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లబోయే టాప్ 5 కామానర్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు  వీళ్ళే ఫిక్స్ అని కూడా తెలుస్తోంది.

New Update

BIGG BOSS 9 TELUGU: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ రివీల్ చేయనున్నారు. ఇప్పటికే మేకర్స్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయాగా.. ఆడియన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇందులో నాగార్జున ఎంట్రీ, బిగ్ బాస్ హౌజ్ విజువల్స్ అదిరిపోయాయి. గత సీజన్స్ లో కంటే ఈ సీజన్ లో హౌస్ చాలా లగ్జరీగా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ''డబుల్ హౌస్.. డబుల్ డోస్'' అంటూ కొత్త  ఫార్మేట్ తో షోని ప్లాన్ చేశారు. దీని అర్థం సెలబ్రెటీస్ వర్సెస్ సామాన్యులుగా షో రసవత్తరంగా ఉండనుంది. 

'అగ్నిపరీక్ష'  అనే షో ద్వారా సామాన్యుల ఎంపికను నిర్వహించారు మేకర్స్. ఈ షోలో మొత్తం 15 మంది కామనర్స్ బిగ్ బాస్ ఎంట్రీ కోసం పోటీపడగా.. అందులో గెలిచిన టాప్ 5 బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెడతారు. వివిధ టాస్కుల్లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్,  ఆడియన్స్ ఓటింగ్ ద్వారా  టాప్ 5 ని నిర్ణయిస్తారు.  అగ్ని పరీక్షలో గెలిచి హౌజ్ లోకి వెళ్లబోయే ఆ టాప్ 5 కామానర్స్ ఎవరనేది ఈరోజు సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది. అయితే దానికంటే ముందే సోషల్ మీడియాలో టాప్ 5 కామనర్స్ లిస్ట్ కి సంబంధించి కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు  వీళ్ళే ఫిక్స్ అని కూడా  తెలుస్తోంది. మరి సామాన్యుల నుంచి వెళ్లబోయే ఆ లక్కీ 5 ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

బిగ్ బాస్ లో అడుగుపెట్టే కామనర్స్ వీళ్ళే!

మొత్తం 15 మంది కామనర్స్ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొనగా..  మనీష్ మర్యాద, అనూష, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్, ప్రియా శెట్టి  ఈ ఐదుగురు  బిగ్ బాస్ లో అడుగుపెట్టె ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అగ్నిపరీక్ష షో పర్ఫార్మెన్స్ ప్రకారం.. చాలా మంది ఆడియన్స్  డెమోన్ పవన్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత, నాగ బిగ్ బాస్ లోకి వెళ్తారని భావించారు. కానీ, ఊహించని విధంగా బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 

Advertisment
తాజా కథనాలు