BIGG BOSS 9 TELUGU: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. గత సీజన్ మాదిరిగా కాకుండా ఈ సీజన్ లో జనాలకు తెలిసిన మొహాలతో షోను నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. సినిమా హీరోయిన్స్, బుల్లితెర నటులు, కొరియోగ్రాఫర్స్, పొలిటికల్ నేపథ్యం ఉన్నవారిని ఎంపిక చేశారట. ఇందులో ప్రముఖ బుల్లితెర నటుడు, మెగా ఫ్యామిలీ సన్నిహితుడు భరణి శంకర్ కూడా ఉన్నారని టాక్. భరణి శంకర్ బుల్లితెరపై 30కి పైగా సీరియల్స్ తో అలరించారు. 'సీతామహాలక్ష్మి', 'తరంగాలు', 'కుంకుమ రేఖ' వంటి సీరియల్స్‌లో కామెడీ , రొమాంటిక్, విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. టీవీ సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోనూ నటించారు. 'బాహుబలి', 'పరమ వీర చక్ర', 'ఆవిరి' వంటి చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించి తన నటనలోని వైవిధ్యాన్ని కనబరిచారు.
నాగబాబు గారిని ఎవరైనా ఏమైనా అంటే పగిలిపోద్ది భరణి శంకర్ #BharaniShankar #chilasowSravanthi #Actor #Lolokplease
Posted by Lol Ok Please on Thursday, September 4, 2025
భరణి..
ఇప్పుడు ఆయన బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. నటనతో మెప్పించిన భరణి ఆటలో కూడా తన వ్యూహాలు, ఆట తీరుతో బిగ్ బాస్ షోను రసవత్తరంగా మార్చగలరని ప్రేక్షకులు భావిస్తున్నారు. భరణి తో పాటు సినిమా ఫీల్డ్ నుంచి 'జయం' ఫేమ్ నటుడు సుమన్ శెట్టి, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ, బాలయ్య 'లక్స్ పాప' సాంగ్ ఫేమ్ ఆశా సైని, బుజ్జిగాడు హీరోయిన్ సంజనా గల్రాని, వంటి పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also Read:SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్