40రోజులుగా బ్లీడింగ్..హాస్పిటల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి, ఏమైందంటే? బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. గత 35-40 రోజుల నుండి విపరీతమైన బ్లీడింగ్ కాగా హాస్పిటల్‌లో చేరింది. ఇది చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశానని..ఎక్కువ కావడంతో డాక్టర్ వద్దకు వెళ్లగాా అది పెద్ద సమస్య అని చెప్పినట్లు తెలిపింది. By Seetha Ram 15 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బిగ్ బాస్ ఫేమ్ అండ్ యాంకర్ స్రవంతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. బిగ్ బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న స్రవంతి.. అదే ఫేమ్‌తో పలు షోలకు యాంకర్‌గా అవకాశం అందుకుంది. దీంతో తన లైఫ్ సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. ఇది కూడా చదవండి: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ! ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు తాజాగా స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో తన అనారోగ్యం గురించి చెప్పుకొచ్చింది. తాను అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. కానీ ఇప్పుడు పెట్టక తప్పలేదంది. అయితే కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఇలా చెబుతున్నానని తెలిపింది. ముఖ్యంగా “ఆడవారికోసం” ఈ విషయం చెబుతున్నానని పేర్కొంది. Also Read : దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా.. గత 35 - 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్‌గా విపరీతమైన బ్లీడింగ్ అయిందని తెలిపింది. దీనికోసం రకరకాల మెడిసిన్ వాడానని చెప్పింది. అయితే డాక్టర్‌ని డైరెక్ట్‌గా వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదని పేర్కొంది. ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగిందని తెలిపింది. Also Read : ఏపీలో షాకింగ్ ఘటన.. వందలాది సీసీ కెమెరాల సీక్రెట్స్ లీక్ చేస్తూ..! View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) విపరీతమైన కడుపు నొప్పి ఆ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్‌ని కంసల్ట్ అయ్యానని చెప్పింది. అయితే అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని. దీంతో వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. ఈజీగా కంప్లీట్‌గా రికవర్ అవ్వాలి.. ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడుతుందని డాక్టర్లు చెప్పారని పేర్కొంది. Also Read : డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! అందువల్ల తాను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటో వివరించింది. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేసాను మళ్లీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండని సూచించింది. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపింది. నెగ్లెట్ చెయ్యకండి వర్క్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండని తెలిపింది. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండని సూచించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. వెంటనే కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. #bigg-boss-telugu-8 #tollywood #anchor-sravanthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి