/rtv/media/media_files/2025/09/07/nagarjuna-2025-09-07-06-48-10.jpg)
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ రోజు 7 గంటలకు ప్రారంభం కానుంది. మరోసారి కింగ్ నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇది ఆయనకు ఏడో సీజన్. ఈ సీజన్ థీమ్ రణరంగం అంటే యుద్ధభూమి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.
Also Read : Warangal : వరంగల్‌లో వర్షం బీభత్సం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
అయితే ఈ సీజన్ లో కొత్తగా రెండు ఇళ్ళు ఉండబోతున్నాయి. ఒక ఇంటిలో సెలబ్రిటీలు, మరొక ఇంటిలో కామనర్ కంటెస్టెంట్స్ ఉండనున్నారు. ఇది షోకి మరింత డ్రామా, వినోదాన్ని తీసుకురానుంది. ఈసారి సాధారణ ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం కల్పించారు. అగ్నిపరీక్ష అనే ప్రీ-షో ద్వారా కొంతమంది కామనర్లను నిర్వహకులు ఎంపిక చేశారు. ఈ సీజన్ లోకి రాబోతున్నారని ఊహించిన కంటెస్టెంట్స్ జాబితాలో కొంతమంది ఉన్నారు.
తెలుగు బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది..#BiggBoss9Telugu#Nagarjunapic.twitter.com/eHFaEAJ5f5
— Telugu Stride (@TeluguStride) September 6, 2025
సెలబ్రిటీలు: భరణి శంకర్, రితు చౌదరి, రమ్య మోక్ష, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నవ్య స్వామి, నాగ దుర్గ గుత, తేజస్విని గౌడ, జబర్దస్త్ వర్ష, డెబ్జానీ మోడక్, ఆశా సైనీ, సంజన గల్రాని, కొరియోగ్రాఫర్ శ్రస్తి వర్మ, సింగర్ రాము రాథోడ్, సింగర్ శ్రీతేజ, దువ్వాడ మాధురి.
కామనర్ కంటెస్టెంట్స్: నాగ ప్రశాంత్, మర్యాద మనీష్, హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్), దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ (ఆర్మీ పవన్ కళ్యాణ్), దివ్య నిఖిత, ప్రియా శెట్టి. అధికారిక కంటెస్టెంట్స్ జాబితా కోసం లాంచ్ ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు.
రూ. 35 కోట్ల పారితోషికం
కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం నాగార్జున దాదాపు రూ. 30 కోట్ల నుండి రూ. 35 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. గత సీజన్‌తో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగిందని అంటున్నారు.నాగార్జున ఈ షోకు ఉన్న క్రేజ్ మరియు ఆయన హోస్ట్ చేసిన సీజన్లకు ఉన్న ప్రజాదరణ కారణంగా నిర్వాహకులు ఈ స్థాయిలో పారితోషికం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.