/rtv/media/media_files/2025/10/13/divvela-madhuri-and-srija-2025-10-13-09-28-40.jpg)
divvela madhuri and srija
బిగ్ బాస్ సీజన్ 9లో షాకింగ్ ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీస్ వల్ల కాస్త రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్‌లో రియల్ నటుడు నిఖిల్ నాయర్, నటి అయేషా జీనథ్, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి హౌస్‌లోకి వెళ్లిన వెంటనే లొల్లి స్టార్ట్ చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వెంటే దివ్వెల మాధురిని ఇమ్మాన్యూయేల్, రీతూ, రాము రాథోడ్ పలకరించారు. ఎందుకంటే ఈమె గురించి తెలుసు. కానీ మిగతా హౌస్ మేట్స్‌కు ఆమె కోసం పెద్దగా తెలియదు. అయితే ఆమె హౌస్‌లోకి వెళ్లిన తర్వాత శ్రీజ మీరు పేరు తెలుసుకోవచ్చా? అని అడుగుతుంది. దీంతో మాధురికి ఎక్కడో కాలి.. మిగతా హౌస్‌మేట్స్‌ను అడిగి తెలుసుకో అని పొగరుగా అంటుంది. నేను పాపులర్, అందరికీ నేను తెలుసు అనే పొగరు, ఆమెలో క్లియర్‌గా కనిపిస్తుంది.
ఇది కూడా చూడండి: Allu Arjun Fans Association: అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం ఇక్కడుంది.. ఫుల్ లిస్ట్ ఇదే..!
Srija is messing up with everyone 😵💫🔥
— SAMBA. N'T'R (@gudapurisamba) October 13, 2025
She argued with Ramya 😤👀
Now she's trying to pick a fight with Madhuri gaaru too 😡🎯
Why so hyper, Srija? ⚡🧨 Chill pill teeskondi!#BiggBossTelugu9pic.twitter.com/eVASPNPyDD
ఇది కూడా చూడండి: Andhra King: ఆంధ్ర కింగ్ గా ఉపేంద్రే ఎందుకు..? తెలుగు హీరోలు లేరా..?
వచ్చి రాగానే హౌస్‌లో గొడవ..
ఆ తర్వాత లివింగ్ రూమ్‌లోకి వచ్చి కూర్చున్న తర్వాత.. శ్రీజ మాధురితో మాట్లాడుతుంది. నిజంగానే నాకు మీ పేరు తెలియదు.. అందుకే అడిగాను.. అందులో తప్పేముందని శ్రీజ అంటుంది. దానికి మీరు హౌస్‌మేట్స్‌ను అడిగి తెలుసుకోండని అన్నారు.. అసలు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాలేదని శ్రీజ అన్నది. దీంతో దివ్వెల మాధురి.. వచ్చి రాగానే ఇప్పుడు నాతో గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నావా.. అని అంటుంది. అయినా పేరు అడిగి తెలుసుకోవడంలో తప్పేముందని శ్రీజ అనడంతో వారి గొడవ ముగిసింది. హౌస్‌లోకి వచ్చిన వెంటనే దివ్వెల మాధురి ఇలా గొడవ పెట్టుకోవడంతో హౌస్ మేట్స్‌తో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. మున్ముందు ఇంకా ఎన్ని యుద్ధాలు జరుగుతాయో అని నెటిజన్లు అంటున్నారు.