/rtv/media/media_files/2025/10/13/arjun-fans-association-2025-10-13-08-06-54.jpg)
Allu Arjun Fans Association
Allu Arjun Fans Association: తెలుగు సినీ పరిశ్రమలో అభిమాన సంఘాల ప్రాధాన్యత ఒక కాలంలో ఎంతో ఎక్కువగా ఉండేది. 80లు, 90లు, 2000లలో స్టార్ హీరోల అభిమాన సంఘాలు బాగా ఎక్కువగా ఉండేవి. అయితే, కాలం మారేకొద్దీ చాలా సంఘాలు క్రమంగా క్రమంగా కనుమరుగైపోయాయి. కానీ ఇప్పటికీ కొన్ని సంఘాలు తమ ప్రత్యేకతను కొనసాగిస్తున్నాయి. అలాంటి సంఘాల్లో తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా అధికారికంగా ఏర్పాటు అయ్యి వార్తల్లో నిలిచింది.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
We are delighted to officially launch and announce the Allu Arjun Fans Association!
— Allu Arjun Fans Association (@AAFAOnline) October 12, 2025
Presenting the list of elected committee members of both AP & TS States who will serve for the upcoming term.
Hearty congratulations and best wishes to all the members – may your journey ahead… pic.twitter.com/Ca2cJjg0Pr
Allu Arjun Fans Association
ఇప్పటివరకు అల్లు అర్జున్ అభిమానులు మెగా అభిమాన సంఘాల కిందే కార్యకలాపాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా "Allu Arjun Fans Association" పేరిట కొత్తగా ఏర్పాటైన ఈ సంఘం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా కమిటీ సభ్యులను ఎన్నుకుంది. ఈ సంఘం కొద్ది రోజుల క్రితమే రిజిస్టర్ అయింది.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
సంఘం అధికారిక ట్విట్టర్ (X) ఖాతా ద్వారా ప్రకటన చేస్తూ, “అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను అధికారికంగా ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కమిటీ సభ్యులను ప్రకటిస్తున్నాం. వీరందరికీ అభినందనలు, భవిష్యత్తులో విజయవంతమైన ప్రయాణం కావాలని కోరుకుంటున్నాం” అని తెలియజేసింది.
ఈ సంఘం ముఖ్యంగా అభిమానుల కోసం సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, ఇతర సామాజిక కార్యక్రమాలను ప్రణాళికతో నిర్వహించనుంది. సోషల్ మీడియా నుంచి ఆఫ్‌లైన్ ఈవెంట్స్ వరకు ఈ సంఘం అభిమానుల శ్రేయస్సుకు పని చేస్తుందని ఆశిస్తున్నారు.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
ఇటీవలి కాలంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే వేరుగా కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పుడు ఈ అధికారిక సంఘం ద్వారా అభిమానుల్లో ఒక సమైక్యత, గుర్తింపు ఏర్పడే అవకాశం ఉంది.
Also Read : కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!
అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సంఘం, ఒక సరికొత్త దిశలో అభిమాన వ్యవస్థను నడిపించే అవకాశం ఉంది. అభిమానం కేవలం సినిమాలకే పరిమితమవకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా మారే దిశగా ఈ సంఘం అడుగులు వేస్తుందా? అనేది ఆసక్తికర అంశం.