పృథ్వీ, హరితేజ ఎలిమినేటెడ్
అయితే ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం.. హరితేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు అంటున్నారు. కానీ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. పృథ్వీ కూడా అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ వారం పృథ్వీ టాస్కుల్లో బాగా ఆడినప్పటికీ .. నబీల్, అతని మధ్య జరిగిన గొడవ కారణంగా కాస్త నెగెటివ్ ఇమేజ్ క్రియేట్ అయిందని అనుకుంటున్నారు. ఇది పృథ్వీ ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక హరితేజ విషయానికి వస్తే.. సీజన్ 1 తో పోలిస్తే ఇప్పుడు ఆమె ఆట తీరు ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని టాక్ వినిపిస్తోంది.
Also Read: Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ అదిరిపోయింది మావా.. చూస్తే అరుపులే
నబీల్ కాపాడేది ఎవరిని..?
ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. నబీల్ తాను గెలుచుకున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి యూజ్ చేయొచ్చు..? ఒకవేళ పృథ్వీ, హరితేజ మధ్య డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే.. నబీల్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ పృథ్వికి యూజ్ చేసే అవకాశం ఉంది. అప్పుడప్పుడు పృథ్వీ, నబీల్ మధ్య గొడవలైనప్పటికీ.. మొదటి నుంచి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. కావున పృథ్వీనీ సేవ్ చేయొచ్చు.
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!