Bigg Boss: అవినాష్ ఎలిమినేటెడ్.. కానీ నబీల్ ట్విస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ వీక్ పృథ్వీ, యష్మీ, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు టాక్.

New Update

అవినాష్, విష్ణు ప్రియా డేంజర్ జోన్

అయితే ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం ఈ వారం అవినాష్, విష్ణు ప్రియా డేంజర్ జోన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరిలో అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నారు. అయితే అవినాష్ ఇప్పటివరకూ నామినేషన్స్ లోకి రాకపోవడమే తన ఓటింగ్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ నామినేషన్స్ ఉన్న అందరికీ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ క్రియేట్ అవడంతో.. వాళ్లకు తమకు కావాల్సిన కంటెస్టెంట్ కి ఓట్ చేస్తారు. దీని వల్ల అవినాష్ మొదటి సారి రావడంతో ఓటింగ్ పడే అవకాశం తక్కువగా ఉందని అంటున్నారు. 

Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్

ఇది ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ అవినాష్ రెండో సారి మెగా చీఫ్ అయ్యాడు. ఒకవేళ అవినాష్ నిజంగానే ఎలిమినేట్ అయితే.. తాను మెగా చీఫ్ అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే అవినాష్ సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నబీల్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి  అవినాష్ ని సేవ్ చేయొచ్చు.  

 

Also Read: పుష్ప-2 గురించి అదిరే అప్‌డేట్ ఇచ్చిన రష్మిక.. ఫొటోలు వైరల్

Also Read :  మాట తప్పి చేతులెత్తేసిన రేవంత్.. మహారాష్ట్ర ప్రచారంలో పవర్ స్టార్ పంచులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు