Abdu Rozik: బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై దొంగతనం కేసు.. అరెస్టు చేసిన దుబాయ్ పోలీసులు

'బిగ్ బాస్ 16' ఫేమ్ అబ్దు రోజిక్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఆరోపణలపై దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతని బృందం అరెస్ట్‌ను ధృవీకరించింది. కానీ ఆరోపణల వివరాలు ఇంకా తెలియరాలేదు.

New Update
bigg boss fame abdu rozik arrested by dubai police on allegations of theft

bigg boss fame abdu rozik arrested by dubai police on allegations of theft

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ ఫేమ్ అబ్దు రోజిక్ తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అబ్దు రోజిక్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుపై దొంగతనం ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మోంటెనెగ్రో నుంచి దుబాయ్ తిరిగి వస్తుండగా.. దుబాయ్ విమానాశ్రయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అబ్దు ఏమి దొంగతనం చేశాడనేది ఇంకా వెల్లడి కాలేదు. 

abdu rozik arrest

ఈ వార్తను అబ్దు రోజిక్ మేనేజింగ్ కంపెనీ వెల్లడించింది. అబ్దు మేనేజింగ్ కంపెనీ దుబాయ్ న్యూస్ పోర్టల్ 'ఖలీజ్ టైమ్స్'కు ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే ఈ సమయంలో అబ్దుపై ఉన్న అభియోగాల గురించి ఏమీ వెల్లడించలేదు. అబ్దు అరెస్టు అయ్యాడని మాత్రమే తాము చెప్పగలమని, ఇంతకంటే ఎక్కువ సమాచారాన్ని పంచుకోలేమని బృందం తెలిపింది. 

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

ఇదిలా ఉంటే అబ్దు అనేది అందరికీ తెలిసిన పేరు. అబ్దు రోజిక్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేస్తూనే ఉంటాడు. అబ్దు అభిమానులు కూడా అతని పోస్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు అబ్దు అరెస్టు వార్తలతో, అతని అభిమానులు, వినియోగదారులు కంగారు పడుతున్నారు. అబ్దు ఇలా ఎలా చేయగలిగాడని ఆశ్చర్యపోతున్నారు?. 

Advertisment
Advertisment
తాజా కథనాలు