Bigg Boss 9 Telugu: లైవ్‌లోనే డిమోన్‌ పవన్‌కు కిస్ చేసిన రీతూ.. కన్ఫార్మ్ లవ్ అంటున్న అలేఖ్య చిట్టి పికిల్స్!

డిమోన్ పవన్ మెడపై రీతూ చౌదరి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నీతో మాట్లాడకుండా ఉండలేకపోయానని పవన్ అనడంతో రీతూ పరిగెత్తుతూ వెళ్లి హగ్ చేసుకుని తన మెడపై కిస్ చేసి వెళ్లిపోతుంది.

New Update
Reethu Pavan

Reethu Pavan

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హౌస్‌లో కాస్త గొడవలు కావడంతో షో కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతీ సీజన్ బిగ్ బాస్ హౌస్‌లో ఓ ప్రేమ జంట ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో డిమోన్ పవన్, రీతూ చౌదరి క్లోజ్‌గా ఉంటున్నారు. వీరిద్దరూ ఎక్కువ సమయం కలిసి ఉండటం, తినిపించుకోవడం ఇలా ప్రతీ పని ఇద్దరూ కలిసి చేస్తున్నారు. బజ్ కోసం లవ్ ట్రాక్ మొదలు పెట్టారో లేకపోతే నిజంగానే ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయనే విషయం అయితే తెలియదు. కానీ ఇష్టమని పలుమార్లు రీతూ, డిమోన్ పవన్ కూడా తెలిపారు. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో డిమోన్ పవన్ మెడపై రీతూ చౌదరి కిస్ చేస్తుంది.

ఇది కూడా చూడండి:  Mamitha Baiju: అందంతో మెస్మరైజ్ చేస్తున్న డ్యూడ్ హీరోయిన్.. క్యూట్‌నెస్‌కు పడిపోతున్న కుర్రాళ్లు !

నీతో మాట్లాడకుండా ఉండలేను..

మాట్లాడకుండా ఒక రోజు ఉండమన్నారని కన్వర్జేషన్ మొదలు అవుతుంది. కానీ నేను ఉండలేకపోయానని డిమోన్ పవన్ అనడంతో వెంటనే రీతూ పరిగెత్తుతూ వెళ్లి హగ్ చేసుకుని తన మెడపై కిస్ చేసి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ తర్వాత మరో క్లిప్‌లో అలేఖ్య చిట్టి పికిల్స్ డిమోన్ పవన్ మాట్లాడతారు. పవన్ నీ కళ్లలో ప్రేమ కనిపిస్తుందని, నిజంగానే నువ్వు రీతూను లవ్ చేస్తున్నావని అంటుంది. తను లవ్ లేదని అన్నా కూడా నీవు ఏడుస్తున్నావని అంటుంది. మరి రీతూ లవ్ రియల్ ఆర్ నాట్ నాకు తెలియదని అలేఖ్య చిట్టి పికిల్స్ అంటుంది. అయితే హౌస్‌లో వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఇద్దరూ ఎక్కువగా హగ్‌లు చేసుకుంటూ, క్లోజ్‌గా ఉంటారు. మరి నిజంగానే లవ్ చేసుకుంటున్నారా? ఫొటేజ్ కోసమా? అనేది వాళ్లకే తెలియాలి.

ఇది కూడా చూడండి: Yellamma Movie Hero: ఎల్లమ్మ మూవీ హీరోగా దేవీ శ్రీ ప్రసాద్?

Advertisment
తాజా కథనాలు