Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 నుంచి మరో ప్రోమో.. హౌస్‌లోకి వెళ్లే కామనర్స్‌ను సెలక్ట్ చేసింది వీళ్లే!

మరికొన్ని నిమిషాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుండగా తాజాగా ప్రోమోను విడుదల చేశారు.ఇందులో కామనర్స్‌ను శ్రీముఖి, బిందు, నవదీప్ సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరిని ఓటింగ్ ద్వారా సెలక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

author-image
By Kusuma
New Update

మరికొన్ని నిమిషాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ కానుంది. ఇప్పటికే ఒక ప్రోమోను బిగ్ బాస్ టీం విడుదల చేయగా.. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో శ్రీముఖి, బిందు, నవదీప్ కనిపిస్తారు. గ్రాండ్‌గా లాంఛ్ కానున్న ఈవెంట్ తాజా ప్రోమోలో కామనర్స్ ఎవరెవరు హౌస్‌లోకి వెళ్తున్నారని చూపించారు. అగ్నిపరీక్ష జడ్జి అయిన బిందు మాధవి కామనర్స్ ఫొటోలలోంచి ఒక ఫొటో తీసి పేరు అనౌన్స్ చేయనున్నట్లు ప్రోమోలో చూపించారు. అలాగే  శ్రీముఖి "ఒక సెకండ్, మీరు అనుమతిస్తే.." అంటూ నాగార్జునను ఏదో అడిగినట్లుగా చూపించారు. దీని ద్వారా సామాన్యుల ఎంపికలో కూడా ట్విస్టులు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే జడ్జిలు అయిన బిందు మాధవి, నవదీప్ ఒక్కొక్కరు ఒక కామనర్‌ను హౌస్‌లోకి ఎంపిక చేస్తారని ప్రోమో ప్రకారం తెలుస్తోంది. అయితే శ్రీముఖి, నవదీప్, బిందు ఒక్కో కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి వెళ్లేవారని అనౌన్స్ చేస్తారు. మిగతా ఇద్దరిని ఓటింగ్ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: BIGG BOSS 9 TELUGU: ఊహించని ట్విస్ట్.. 'అగ్నిపరీక్ష' లో గెలిచింది వీళ్ళే! టాప్ 5 కామనర్స్ లిస్ట్ చూసేయండి

ఇది కూడా చూడండి: BIGG BOSS 9 TELUGU: బిగ్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ లోకి మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్రెండ్!

కంటెస్టెంట్స్‌ను సెలక్ట్ చేసేది..

ప్రోమోలో శ్రీముఖి ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెను చూడగానే నాగార్జున ఆమె అందాన్ని మెచ్చుకున్నారు. దానికి శ్రీముఖి తెలివిగా స్పందిస్తూ, "మా ఆడవాళ్ళందరికీ నాగార్జున గారు నచ్చడం చాలా కామన్.. ఎందుకంటే మీరు మా మానసు దోచుకున్న సైమన్..." అంటూ డైలాగ్ చెప్పింది. అయితే ఇక్కడ "మన్మథుడు" అని కాకుండా "సైమన్" అని పిలిచింది. ఇటీవల విడుదల అయిన కూలీ మూవీలో నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ క్రమంలోనే శ్రీ ముఖి సైమన్ అని నాగార్జునను పిలిచింది. ఆ తర్వాత బిందు మాధవి 'అగ్నిపరీక్ష'లో తాము కంటెస్టెంట్లకు ఏం నేర్పించామో తెలియదు కానీ, తాను మాత్రం జడ్జ్ సీట్లో కూర్చొని వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పింది. ఇక నవదీప్‌తో నాగార్జున సరదాగా "ఎల్లో కార్డ్ తీసుకురాలేదు కదా?" అని అడగగా, నవదీప్ "తెచ్చాను సార్!" అంటూ కామెడీ పంచాడు. అయితే, ఈ ఈవెంట్‌లో 'అగ్నిపరీక్ష' జడ్జి అయిన అభిజిత్ కనిపించలేదు. 

Advertisment
తాజా కథనాలు