'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి వరుస ఆఫర్లు..మరో క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్

'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ తో VD12, దుల్కర్ సల్మాన్ 'కాంత' సినిమాలో నటిస్తుండగా.. ఇప్పుడు క్రేజీ హీరో రామ్ పోతినేనితో జోడి కడుతోంది. 'RAPO 22' మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

New Update
bg

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' మూవీ ఫేం మహేశ్ బాబు దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. 'RAPO 22' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. 

Also Read :  రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి..

ఈ నేపథ్యంలో రామ్ పోతినేని సరసన ఎవరు కనిపించబోతున్నానే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు  'రాపో 22లో' రామ్ సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. 

Also read: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడుపై పండ్ల వ్యాపారి..

వరుస ఆఫర్స్ తో బిజీ బిజీ..

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కానీ సినిమాలో భాగ్యశ్రీ తన అందం, డ్యాన్సులతో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. దీంతో ఆమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి 'VD12' మూవీలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా కాంబోలో తెరకెక్కనున్న 'కాంత' అనే సినిమాలో ఛాన్స్ అందుకుంది. 

Also Read :  ప్రేమలో పడ్డ ప్రభాస్ హీరోయిన్.. బాయ్ ఫ్రెండ్ కు స్పెషల్ విషెస్

ఇక ఇప్పుడు క్రేజీ హీరో రామ్ పోతినేనితో జోడి కడుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్‌గా బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ భాగ్య శ్రీ మాత్రమే అని చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాలు కనుక సక్సెస్ అయితే ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడం గ్యారెంటీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

Also Read: సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్‌ గోయెంక సంచలన పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు