VIRAL VIDEO: రాంచరణ్ పై బాలయ్య సీరియస్.. వైరల్ అవుతున్న వార్నింగ్ వీడియో!

'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్య, రామ్ చరణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. సెట్ లో చరణ్.. బాలయ్యను 'సార్' అని పిలిచారు. దాంతో కోప్పడ్డ బాలయ్య, నన్ను అలా పిలవొద్దు, బ్రో అని మాత్రమే పిలవాలంటూ చరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
ram charan balayya

ram charan balayya

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య 'అన్ స్టాపబుల్' టాక్ షోలో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించారు. రామ్ చరణ్ ఇవ్వాళ ఉదయం స్టూడియోకి చేరుకుని, షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆయన కారులో నుండి బయటకు దిగుతూ, వేదిక వైపుగా నడుస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సెట్స్ లో ఎంట్రీ ఇవ్వగానే బాలయ్యను కలిశారు రామ్ చరణ్. దీంతో బాలయ్య ' సంక్రాంతికి వస్తున్నాం.. అని మీడియాకి చెప్పారు. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' రెండు సినిమాలు సక్సెస్ కావాలని కోరుకున్నారు. 

అయితే చరణ్ ఎపిసోడ్ షూటింగ్ లో భాగంగా సెట్స్ లో బాలయ్యను కలిసే క్రమంలో ఆయన్ను 'సార్' అని సంబోధించారు. దాంతో నన్ను సార్ అని పిలవొద్దంటూ చరణ్ పై కోప్పడ్డ బాలయ్య.. ఓన్లీ 'బ్రో' అని పిలవాలంటూ చెర్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం చరణ్ ను హగ్ చేసుకున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్, బాలయ్య మధ్య ర్యాపో చూసి తెగ మురిసిపోతున్నారు. 'అన్ స్టాపబుల్' లో రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ

Advertisment
తాజా కథనాలు