Akhanda 2 Updates: 'ఆఖండ 2' ఆగిపోయిందా..? రూమర్స్‌ పై మూవీ టీమ్ క్లారిటీ

బాలకృష్ణ–బోయపాటి కాంబోలో రూపొందుతున్న అఖండ 2 ఆగిపోయిందని వస్తున్న వదంతుల్లో నిజం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2025 దసరాకు రిలీజ్ కానుంది. షూటింగ్ సజావుగా కొనసాగుతోందని మేకర్స్ తెలిపారు.

New Update
Akhanda 2 Updates

Akhanda 2 Updates

Akhanda 2 Updates: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటేనే మాస్‌ ఫ్యాన్స్‌కి పండగే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా సింహా (2010) బాలయ్య కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా ఇది. వరుస ఫ్లాప్‌లతో   ఉన్న బాలయ్యకు సరైన సమయంలో ఈ చిత్రం ఘన విజయాన్ని అందించడంతో పాటు మళ్లీ బాలకృష్ణను ట్రాక్‌లోకి తెచ్చింది.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

అందుకే ఆ తర్వాత వచ్చిన లెజెండ్ (2014) సినిమాపైనా అంచనాలు పెరిగాయి – అయితే అంచనాలకు మించి విజయం సాధించిన ఈ చిత్రం బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరింత పెంచింది. ఇందులో జగపతి బాబు విలన్‌గా నటించడం విశేషం.

2021లో విడుదలైన వీరి మూడో సినిమా అఖండ ఇంకొక ఘనవిజయాన్ని నమోదు చేసింది. అఘోర గెటప్‌లో బాలకృష్ణ ఓ సరికొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అఖండ 2: తాండవం

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్‌లు సాధించిన ఈ కాంబో, ఇప్పుడు అఖండ 2: తాండవం అనే టైటిల్‌తో నాల్గవ సినిమా చేస్తున్నారు. ఇది 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలుండగా, ఇటీవల ఈ చిత్రం ఆగిపోయిందని, బాలకృష్ణ-బోయపాటి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అయితే ఈ ప్రచారంపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. సినిమాలో ఎలాంటి అంతరాయాలు లేవని, షూటింగ్ యథావిధిగా కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు. ఈ రూమర్స్‌కి చెక్ పెడుతూ, సినిమా షూటింగ్ ప్రాజెక్టు రన్నింగ్‌లో ఉందని నిర్మాతలు ప్రకటించారు.

ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును 14 రీల్స్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, సంగీత దర్శకుడు థమన్ మరోసారి తన మ్యూజిక్‌తో ఆకట్టుకోనున్నారు. అఖండ 2 చిత్రాన్ని 2025 దసరా సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు