Akhanda 2 బాలయ్య 'అఖండ' భారీ విజయం తర్వాత అఖండ 2: తాండవం పై అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రమిది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తిచేసిన బోయపాటి.. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.
#Akhanda2 Scouting For Uncharted Locations In the Nation of Georgia where key sequences will be filmed.
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 25, 2025
The Team is still Targeting Dusshera 2025 release while speculations have emerged in recent days about postponement. pic.twitter.com/KVYWfRslxj
జార్జియాలో లాంగ్ షెడ్యూల్
నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. బాలకృష్ణ, ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి జార్జీయాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది.
telugu-news | cinema-news | latest-news | Akhanda 2 Updates | Balakrishna Akhanda 2 Movie