/rtv/media/media_files/2025/09/13/balakrishna-new-movie-2025-09-13-12-07-11.jpg)
Balakrishna New Movie
Balakrishna New Movie: నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వీరసింహారెడ్డి’ మాస్ హిట్ తర్వాత, బాలయ్య ప్రస్తుతం మూడు సినిమాలపై దృష్టి పెట్టారు. అందులో ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఎపిక్ యాక్షన్‌తో ‘NBK 111’
ఈ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఇది ఎపిక్ యాక్షన్ స్టోరీగా ఉండనుంది. బాలయ్య ఇందులో ఇప్పటివరకు చూడనటువంటి ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా దసరా పండగ సందర్భంగా లాంచ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు బాలయ్య మరో ప్రాజెక్ట్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
బాలయ్య - క్రిష్ కాంబినేషన్‌లో మరో సినిమా
బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో కూడా ఓ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్. దీనిపైన విజయదశమి సమయానికి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. బాలయ్య ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read:'మిరాయ్' సక్సెస్ సెలబ్రేషన్స్.. మంచు మనోజ్ డాన్స్ వీడియో వైరల్..!
బోయపాటి - బాలయ్య - ‘అఖండ 2’
ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. అందుకే ఇప్పుడు ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?
ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా త్రిశూలం సీన్ బాగా వైరల్ అయ్యింది. అయితే కొన్ని VFX సీన్స్ పై విమర్శలు కూడా వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌పై మరింత శ్రద్ధ వహిస్తున్నారు.
అఖండ 2 విడుదల వాయిదా
అయితే అభిమానులను కొంత నిరాశపరిచే వార్త ఏమిటంటే - అఖండ 2 మళ్ళీ వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, రీ-రికార్డింగ్, గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల, ఈ సినిమాను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని తెలియజేస్తామని చెప్పింది. ముందుగా ఈ సినిమా, పవన్ కళ్యాణ్ “ఓజీ”తో కలిసి దసరా బరిలో దిగుతుందని భావించారు. కానీ ఇప్పుడు ‘అఖండ 2’ రేస్ నుంచి తప్పుకోవడంతో, బాక్సాఫీస్ పోటీ కొంత తగ్గింది.