Akhanda 2: బాలయ్య 'అఖండ' లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్! ఇప్పుడు ఎంత అందంగా ఉందో

బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2 నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సల్మాన్ ఖాన్ "బజరంగీ భాయిజాన్" సినిమాలో మున్నీ పాత్రలో నటించిన చైల్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె పోస్టర్ విడుదల చేశారు.

New Update

Akhanda 2: బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న 'అఖండ 2' నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సల్మాన్ ఖాన్  "బజరంగీ భాయిజాన్" సినిమాలో మున్నీ పాత్రలో నటించిన చైల్ ఆర్టిస్ట్  హర్షాలి మల్హోత్రా నటిస్తున్నట్లు ప్రకటించారు. అఖండ 2 లో హర్షాలీ 'జనని' కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో   ఆమె పోస్టర్ విడుదల చేశారు. ఈ వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

జనని పాత్రలో 

బజరంగీ భాయిజాన్ లో  మున్నీ పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న హర్షాలీ.. 'అఖండ' లో ఎలా కనిపించబోతుందా అని ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. హర్షాలీ పాత్ర  బాలయ్య అఘోర పాత్రకు కథకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కులూమనాలీలో ఈ పాప పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఆమె నటన, బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిసి సినిమాకు ఒక కొత్త డైమెన్షన్‌ను ఇస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

దసరా కానుకగా

 'అఖండ 2' ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. హీరో ఆది పినిశెట్టి విలన్ గా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా మరో నెగెటివ్ షెడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 14 రీల్స్ బ్యానర్ పై బాలకృష్ణ కుమార్తె తేజశ్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read: Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు