/rtv/media/media_files/Vn5jnEv0MQowTHL5UXhq.jpg)
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష కాంబోలో నాలుగో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య బర్త్ డేకి ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. #BB4 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నుంచి అదిరిపోయే యూ అప్డేట్ బయటికొచ్చింది. నేడు దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ఓపెనింగ్ డేట్ ను ప్రకటించారు.
అక్టోబర్ 16న ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో #BB4 అని వర్కింగ్ టైటిల్ పెట్టి వెనుక అమ్మవారి ఫోటో పెట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ 'అఖండ' మూవీకి సీక్వెల్ అని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో అమ్మవారి ఫొటోను చూస్తుంటే ఇది నిజమేనని స్పష్టమవుతుంది.
The sensational announcement on the auspicious occasion of Vijaya Dashami 💥💥#BB4Muhurtham on October 16th at 10 AM ✨
— 14 Reels Plus (@14ReelsPlus) October 12, 2024
The massive epic combination will begin its grand journey 💥💥
Team #BB4 Wishes you all a very Happy Dussehra.
'GOD OF MASSES' #NandamuriBalakrishna… pic.twitter.com/xFoCGAGVWM
Also Read : విజువల్ వండర్ గా 'విశ్వంభర' టీజర్.. రెక్కల గుర్రంపై చిరు ఎంట్రీ అదుర్స్
కాగా ఈ ప్రాజెక్ట్ ని 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు మొదటి సారి ఈ సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. బోయపాటి - బాలయ్య కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకున్నాయి. దీంతో #BB4 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.