Chiranjeevi : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'విశ్వంభర' టీజర్ వచ్చేసింది. చెప్పినట్లుగానే దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ విడుదల చేసింది. టీజర్ లో చూపించిన విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. టీజర్ లో చిరంజీవి తెల్లని రెక్కల గుర్రంపై వచ్చే ఎంట్రీ షాట్ మాత్రం అదిరిపోయింది. కీరవాణి బీజీఎంతో టీజర్ స్టార్ అయింది.
'విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్ర వీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది'.. లాంటి డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. టీజర్ చూస్తుంటే రాక్షసుల లోకం, మరో ప్రపంచం ఉన్నట్టు, చిరంజీవికి దైవాంశ ఉన్నట్టు, దుష్టశక్తులను ఎదిరించినట్టు తెలుస్తుంది.
The universes tremble. The world wobbles. The stars shudder - On ONE MAN'S ARRIVAL 💫#VishwambharaTeaser out now ❤️🔥
— UV Creations (@UV_Creations) October 12, 2024
▶️ https://t.co/eZs7nitgRK
Team #Vishwambhara wishes you all a very Happy Vijaya Dashami ✨
MEGA MASS BEYOND UNIVERSE 💥💥
MEGASTAR @KChiruTweets… pic.twitter.com/z9EqpxsLeU
Also Read : సంక్రాంతి రేస్ నుంచి 'విశ్వంభర' అవుట్.. కారణం అదే
ఇక చివర్లో హనుమంతుడి విగ్రహం ముందు మెగాస్టార్ నిలబడే షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. దానికి తోడు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కున్న ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండబోతోంది. ఇందులో చిరు చెల్లెలి పాత్రల్లో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. త్రిష కథానాయికగా కనిపించనుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.